News August 1, 2024
ఒలింపిక్స్‌లో PV సింధు ఓటమి

బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి పాలయ్యారు. చైనాకు చెందిన హీ బింగ్‌తో హోరాహోరీ పోరు జరిగింది. తొలి రౌండ్ నుంచే ఒక్కో పాయింట్ కోసం సింధు శ్రమించాల్సి వచ్చింది. ఫస్ట్ రౌండ్ 19-21 తేడాతో వెనుకబడిన ఆమె తర్వాతి రౌండ్లో(14-21)నూ పోరాడి ఓడిపోయారు. దీంతో సింధు నిరాశతో ఇంటిబాట పట్టారు.
<<-se>>#Olympics2024<<>>
Similar News
News March 12, 2026
X యూజర్లకు షాక్

ఇక నుంచి X (ట్విటర్)లో గ్రోక్‌ను ప్రశ్నలు అడగలేం. కేవలం ప్రీమియం, ప్రీమియం+ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఆ ఫీచర్ అందుబాటులో ఉందని X ప్రకటించింది. ప్రీమియం కోసం నెలకు రూ.230, ప్రీమియం+ కోసం నెలకు రూ.1,285 చెల్లించాలి. కాగా Xలో పోస్టులపై ఏమైనా సందేహాలు ఉంటే నెటిజన్లు గ్రోక్‌ను అడిగి వాటిని నిర్ధారించుకునేవారు.
News March 12, 2026
ప్యాడ్స్ వాడితే దద్దుర్లు వస్తున్నాయా?

పీరియడ్స్‌లో అమ్మాయిలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ప్యాడ్స్ వాడటం వల్ల దద్దుర్లు, దురద వేధిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కాటన్ ప్యాడ్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సెంటెడ్ ప్లాస్టిక్ పూత ఉన్న ప్యాడ్స్ వల్ల గాలి ప్రసరణ జరగక సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే 4-6 గంటలకు ఓ సారి ప్యాడ్ మార్చాలి. మైల్డ్ సబ్బు, గోరువెచ్చని నీటితో వెజినాని క్లీన్ చేయడం వల్ల కూడా సమస్య అదుపులో ఉంటుంది.
News March 12, 2026
మారిన వాతావరణం.. వరికి దోమపోటు ముప్పు!

మారిన వాతావరణ పరిస్థితుల వల్ల వరిలో దోమపోటు ఆశించడానికి అవకాశం ఉంటుంది. వరి దుబ్బుకు పిలక దశలో 10-15 దోమలు, ఈనిక దశలో 20-25 దోమలను గమనిస్తే వాటి కట్టడికి చర్యలు తీసుకోవాలి. అలాగే నత్రజని ఎరువులను నిపుణులు సలహా మేరకు పరిమితంగా వాడాలి. దోమ పోటు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో పైమెట్రోజైన్ 120గ్రా. లేదా డైనోటెఫ్యూరాన్ 80గ్రా. లేదా ట్రైఫ్లూమెజోపైరం 96ml కలిపి మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి.


