News May 3, 2024
BREAKING: రాయ్‌బరేలీ బరిలో రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగనున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది. అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మ పోటీ చేయనున్నట్లు తెలిపింది. వీరిద్దరు ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News January 27, 2026
మంత్రులతో భేటీకి కారణమిదే: భట్టి

TG: మున్సిపల్ ఎన్నికల్లో GPల కంటే మెరుగైన ఫలితాలు వస్తాయని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్‌లో భేటీలో మంత్రులు పరిపాలన, ఎన్నికలకు సంబంధించి మాట్లాడారని చెప్పారు. సీఎం అందుబాటులో లేకపోవడంతో తనతో మాట్లాడి నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. సీఎం, మంత్రులందరం సమష్టిగా పనిచేస్తున్నామన్నారు. సింగరేణిలో అవినీతి జరగలేదని, ఏమైనా అనుమానాలు ఉంటే లేఖ రాస్తే విచారణ చేయిస్తామని తెలిపారు.
News January 27, 2026
మంచుదుప్పటి నడుమ గుడి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో!

అమెరికాలో భారీ హిమపాతం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. మంచు భారీగా పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ డల్లాస్‌లోని కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా మెరిసిపోతోంది. ఈ అద్భుత దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చుట్టూ మంచుతో ఉన్న ఆలయం ఫొటోలు ప్రస్తుతం SMలో వైరలవుతున్నాయి.
News January 27, 2026
ఈ లక్షణాలుంటే C విటమిన్ లోపించినట్లే..

C విటమిన్ మన రోగనిరోధక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన పోషకం. దీని లోపం వల్ల అనేక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. కారణం లేకుండా నిరంతరం అలసిపోయినట్లు, శక్తి లేనట్లు అనిపించడం, జలుబు, దగ్గు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, వాపు, దంతాలు కదలడం, చర్మం పొడిగా మారడం, గాయాలు త్వరగా నయం కాకపోవడం, కీళ్ల నొప్పులు, పొడి జుట్టు, చిట్లిన వెంట్రుకలు ఉంటే C విటమిన్ లోపం ఉన్నట్లు గుర్తించాలంటున్నారు.


