News May 3, 2024

BREAKING: రాయ్‌బరేలీ బరిలో రాహుల్ గాంధీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగనున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది. అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మ పోటీ చేయనున్నట్లు తెలిపింది. వీరిద్దరు ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News December 6, 2025

KMR: మూడో విడత నామినేషన్ల లెక్క ఇంకా తేలలేదు..

image

కామారెడ్డి జిల్లాలో 3వ విడతలో దాఖలైన నామినేషన్ల లెక్క ఇంకా తేలలేదు. సర్పంచ్ 168, వార్డు స్థానాలు 1482 ఉండగా బాన్సువాడ, డోంగ్లి, బీర్కూరు, బిచ్కుంద,మద్నూర్,పెద్ద కొడప్గల్,నస్రుల్లాబాద్ లలో రాత్రి వరకు వచ్చిన నామినేషన్లు సర్పంచ్ స్థానాలకు 899, వార్డు సభ్యుల స్థానాలకు 2576 వచ్చాయి(జుక్కల్ మినహాయించి). జుక్కల్ లో నామినేషన్ల సంఖ్య ఈరోజు తెలిసే అవకాశం ఉంది. నిన్నటితో 3వ విడత నామినేషన్ల దాఖలు ముగిసింది.

News December 6, 2025

పుతిన్ భారత పర్యటనపై చైనా మీడియా ఏమందంటే..?

image

భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనపై చైనా మీడియా స్పందించింది. 2 దేశాలు ఒంటరిగా లేవని ప్రపంచానికి పంపిన సందేశమని ‘గ్లోబల్ టైమ్స్’ చెప్పింది. ‘భారత్, రష్యా తమ సామర్థ్యాలను సొంతంగా, మరింతగా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. 2 దేశాల మధ్య సమన్వయం, సహకారమే ఇందుకు నిదర్శనం. US, వెస్ట్ ఆంక్షలు ఫలించవు’ అని ఫారిన్ అఫైర్స్ వర్సిటీ ప్రొఫెసర్ లీ హైడాంగ్ చెప్పారని తెలిపింది.

News December 6, 2025

30ల్లోకి వచ్చారా..?

image

30ల్లోకి అడుగుపెట్టాక చర్మం నెమ్మదిగా సాగే గుణాన్ని కోల్పోతుంది. కేవలం మాయిశ్చరైజర్ ఈ వయసులో సరిపోదు. యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలి. పగలు ఇ, సి విటమిన్లు, గ్రీన్ టీ ఉన్న ఉత్పత్తులు, రాత్రి రెటినాయిడ్ క్రీములు వాడాలి. ఇవి కొలాజన్ ఉత్పత్తిని పెంచడంతోపాటు చర్మంపై ఏర్పడిన ముడతలు, గీతలను తగ్గిస్తాయి. వీటితో పాటు సన్ స్క్రీన్‌ తప్పనిసరి. ఫేషియల్ ఎక్సర్‌సైజ్‌‌లు చేయడం కూడా మంచిది.