News June 28, 2024
BREAKING: రుణమాఫీకి రేషన్ కార్డు అవసరంలేదు: సీఎం

TG: రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని తేల్చి చెప్పారు. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే అని చెప్పారు. రూ.2లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని సీఎం మరోసారి స్పష్టం చేశారు. ఇక కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు.
Similar News
News July 11, 2025
ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.
News July 11, 2025
చనిపోయినట్లు ప్రకటించిన 12 గంటలకు లేచిన శిశువు!

మహారాష్ట్రలో ఓ వింత సంఘటన జరిగింది. చనిపోయిందనుకున్న శిశువు 12 గంటల తర్వాత తిరిగి బతికింది. బీద్‌లోని రామానంద తీర్థ్ ఆస్పత్రిలో ఓ మహిళ 7వ నెలలోనే 900 గ్రాములున్న శిశువుకు జన్మనిచ్చింది. ఆ బేబీని రాత్రంతా ICUలో ఉంచి ఆ తర్వాత చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఖననం చేసే సమయంలో ముసుగు తీసి చూడగా కదలాడుతున్నట్లు కనిపించింది. వెంటనే వారు ఆ శిశువును మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News July 11, 2025
రికార్డులు ఉండేది బద్దలు కొట్టడానికే: లారా

ఈసారి <<16983109>>క్వాడ్రాపుల్ సెంచరీ<<>>కి అవకాశమొస్తే బాదేయాలని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా చెప్పినట్లు సౌతాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ తెలిపారు. ‘నీ సొంత లెగసీ సృష్టించుకోవాలి. రికార్డులు ఉండేది బద్దలు కొట్టడానికే. మళ్లీ 400 కొట్టే ఛాన్స్ వస్తే వదులుకోకు’ అని లారా చెప్పినట్లు ముల్డర్ తెలిపారు. కాగా లారా(400*) రికార్డును అధిగమించే ఉద్దేశం లేకే 367* స్కోర్ వద్ద డిక్లేర్ చేసినట్లు ముల్డర్ వెల్లడించారు.