News November 30, 2024

BREAKING: రాష్ట్రానికి RED ALERT జారీ

image

ఫెంగల్ తుఫాన్ ఏపీ, తమిళనాడు తీరం వైపు దూసుకొస్తోంది. దీంతో ఏపీ, తమిళనాడుకు వాతావరణ శాఖ RED ALERT జారీ చేసింది. దీని ప్రభావంతో తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ తీరం దాటేటప్పుడు 70-80కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ఆయా జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Similar News

News January 14, 2025

జనవరి 14: చరిత్రలో ఈరోజు

image

1896: భారత ఆర్థికవేత్త సి.డి.దేశ్‌ముఖ్ జననం
1937: సినీ నటుడు రావు గోపాలరావు జననం
1937: సినీ నటుడు శోభన్ బాబు జననం
1951: సినీ దర్శకుడు జంధ్యాల జననం
1979: కవి కేసనపల్లి లక్ష్మణకవి మరణం
1980: సినీ నటుడు ముదిగొండ లింగమూర్తి మరణం

News January 14, 2025

స్టేషన్ బెయిల్‌పై కౌశిక్‌ను విడిచిపెట్టాలి: హరీశ్

image

TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం సరికాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ విషయమై డీజీపీ జితేందర్‌కి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. స్టేషన్ బెయిల్‌పై కౌశిక్‌ను విడిచిపెట్టాలని కోరారు. మరోవైపు పోలీసులు ఎమ్మెల్యేను అనూహ్యంగా త్రీటౌన్ స్టేషన్ కు తరలించారు. జడ్జి ముందుకు ప్రవేశపెట్టే విషయంలో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఆయనకు స్టేషన్‌లో బస ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

News January 14, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.