News November 30, 2024
BREAKING: రాష్ట్రానికి RED ALERT జారీ
ఫెంగల్ తుఫాన్ ఏపీ, తమిళనాడు తీరం వైపు దూసుకొస్తోంది. దీంతో ఏపీ, తమిళనాడుకు వాతావరణ శాఖ RED ALERT జారీ చేసింది. దీని ప్రభావంతో తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ తీరం దాటేటప్పుడు 70-80కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ఆయా జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News December 11, 2024
ఏపీలో గూగుల్ పెట్టుబడులు.. ప్రభుత్వంతో ఒప్పందం
APలో గూగుల్ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టనుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ మధ్య ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో పెద్దఎత్తున ఐటీని అభివృద్ధి చేస్తామని గూగుల్ ప్రతినిధులు వెల్లడించారు. గూగుల్ పెట్టుబడులను స్వాగతిస్తున్నామని, ఈ ఒప్పందం వల్ల దేశ ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. గూగుల్‌కు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తామని ఆయన అన్నారు.
News December 11, 2024
సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణులకు సీఎం విషెస్
TG: రాష్ట్రంలో సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన 20 మందికి సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. సింగరేణి సహకారంతో ప్రభుత్వ ఆర్థిక సాయం అందుకొని సివిల్స్ ప్రధాన పరీక్షల్లో రాణించడం తమకు గర్వకారణమని తెలిపారు. ఒక చిరు దీపం కొండంత వెలుగును ఇస్తుందని, ప్రభుత్వ చిరు సాయం గొప్ప ఫలితాలను అందించిందని పేర్కొన్నారు.
News December 11, 2024
ఇందిరమ్మ ఇళ్లపై BIG UPDATE
TG: ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తులను పక్కాగా పరిశీలించాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ‘ఈ నెల 31లోపు పరిశీలన చేసి, వివరాలను యాప్‌లో నమోదు చేయాలి. ప్రతి 500 మందికి ఒక సర్వేయర్‌ను నియమించుకోవాలి. ఏ గ్రామంలో సర్వే చేస్తారో ముందు రోజే చాటింపు వేయాలి. ఏ ఒక్క దరఖాస్తును వదిలిపెట్టొద్దు. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి’ అని సూచించారు.