News June 27, 2024

వైసీపీ ఆఫీసులకు నోటీసులపై తీర్పు రిజర్వ్

image

AP: రాష్ట్రంలోని 16 వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపారు. కాగా YCP ఆఫీసులను అనుమతుల్లేకుండా కడుతున్నారని, ఎందుకు కూల్చకూడదో చెప్పాలంటూ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News October 11, 2024

East Asia సదస్సులో మోదీ రికార్డ్

image

East Asia సదస్సులో హోస్ట్, కాబోయే ఛైర్‌పర్సన్ తర్వాత మాట్లాడే మొదటి అతిథి ప్రధాని నరేంద్రమోదీ అని తెలిసింది. ఇప్పటి వరకు ఈ సదస్సు 19 సార్లు జరగ్గా 9 సార్లు పాల్గొన్న ఏకైక నేతగా ఆయన రికార్డు సృష్టించారు. ఏషియా పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, శాంతి గురించి ఆయన మాట్లాడతారు. క్వాడ్ పాత్రను వివరిస్తారు. లావోస్ బయల్దేరే ముందు ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ఇక ASEANలోనూ భారత్ పాత్ర, ప్రాముఖ్యం పెరిగింది.

News October 11, 2024

ఇ-కామర్స్ కంపెనీల dark patternsపై కేంద్రం స్క్రూటినీ

image

ఫెస్టివ్ సీజన్లో ఇ-కామర్స్ కంపెనీలు డార్క్ ప్యాటర్న్ రూల్స్ పాటిస్తున్నాయో లేదో పరిశీలించేందుకు కేంద్రం సిద్ధమైంది. యూజర్ల ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకుంది. కస్టమర్లు త్వరగా కొనేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీని క్రియేట్ చేస్తుంటాయి. ఇంకా 2 ఐటెమ్స్ మాత్రమే ఉన్నాయి, మరికాసేపట్లో ఈ వస్తువుపై డిస్కౌంట్ ఉండదని ఫ్లాష్ చేస్తుంటాయి. ఇవన్నీ అన్‌ఫెయిర్ ప్రాక్టీసెస్ కిందకు వస్తాయి.

News October 11, 2024

మందు బాబులపై ‘రౌండాఫ్’ భారం

image

AP: నూతన లిక్కర్ పాలసీలో రౌండాఫ్ పేరుతో ఛార్జీల వసూలుకు ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ విధానంపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఉదాహరణకు మద్యం బాటిల్ ధర ₹150, ₹200 ఉంటే యథాతథంగా ఉంచుతారు. ఆ రేటుకు అర్ధరూపాయి ఎక్కువున్నా రౌండాఫ్ చేసి ₹160, ₹210 వసూలు చేస్తారు. ఒకవేళ సీసా ధర ₹90.5 ఉంటే రౌండాఫ్ ₹99 చేస్తారు. రూ.99కే నాణ్యమైన క్వార్టర్ మద్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.