News January 28, 2025
BREAKING: వారికి రూ.15,000: ప్రభుత్వం

AP: సర్వీసులో ఉంటూ మరణించిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15వేలు మంజూరు చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర స్త్రీలు, పిల్లలు, వికలాంగులు & సీనియర్ సిటిజన్ల శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మరణించిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు చెందిన చట్టబద్ధమైన వారసులకు ఈ సొమ్మును చెల్లించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
Similar News
News July 8, 2025
ఫిష్ వెంకట్‌కు హీరో విశ్వక్ సేన్ సాయం

కిడ్నీ సమస్యలతో తెలుగు నటుడు <<16976046>>ఫిష్ వెంకట్<<>> ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందనే సమాచారం తెలుసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మంచి మనసు చాటుకున్నారు. వైద్య అవసరాల కోసం రూ.2లక్షల చెక్కును వెంకట్ కుటుంబానికి అందించారు. అటు సినీ పెద్దలు కూడా ముందుకొచ్చి స్పందించాలని వెంకట్ కుటుంబం వేడుకుంటోంది.
News July 8, 2025
ఛార్జీల తగ్గింపును వినియోగించుకోవాలి: RTC

AP: విశాఖ నుంచి BHEL, MGBS, విజయవాడ, అమలాపురం వెళ్లే బస్సు ఛార్జీలు తగ్గగా, ఇటీవల అమల్లోకి వచ్చాయి. అమరావతి, నైట్ రైడర్ సీట్, బెర్త్, ఇంద్ర బస్సుల్లో 10% ఛార్జీలు తగ్గగా, ప్రయాణికులు వినియోగించుకోవాలని RTC యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. బస్సుల ఆక్యుపెన్సీ పెంచేలా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అమరావతి బస్సుకు విశాఖ-BHEL ఛార్జీ రూ.1870 నుంచి రూ.1690కి, విజయవాడ ఛార్జీ రూ.1070 నుంచి రూ.970కి తగ్గింది.
News July 8, 2025
హై బడ్జెట్.. MEGA157 నాన్ థియేట్రికల్ రైట్స్‌కే రూ.100 కోట్లు?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ సైతం శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ మూవీ బడ్జెట్ భారీగా పెరిగినట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో నాన్ థియేట్రికల్ రైట్స్ నుంచే రూ.100 కోట్ల వరకూ వసూలు చేయాలని, అలా చేస్తేనే గిట్టుబాటు అవుతుందని పేర్కొన్నాయి. కాగా, MEGA157 చిత్రీకరణకు రూ.180 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.