News January 8, 2025

BREAKING: త్వరలో సర్పంచ్ ఎన్నికలు: సీఎం

image

తెలంగాణలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో భేటీలో సూచించారు. ఈ నెల 26న రైతు భరోసా ఇస్తున్నామని, రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు అందిస్తామని, రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామని పీసీసీ చీఫ్‌కు సీఎం వివరించారు. కాగా బీసీ రిజర్వేషన్లపై నివేదిక వచ్చాక ఎన్నికలు జరిగే అవకాశముంది.

Similar News

News January 18, 2025

బీదర్, అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో పురోగతి

image

బీదర్‌లో <<15169507>>ఏటీఎం డబ్బులు<<>> చోరీ చేసి, HYD అఫ్జల్‌గంజ్‌లో <<15172705>>కాల్పులు జరిపిన<<>> నిందితుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారు. బిహార్‌కు చెందిన మనీశ్, మరికొందరు కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని, ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని ఓ బ్యాంకులో రూ.70లక్షలు చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. మనీశ్, అతని ముఠా కోసం తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ పోలీసులు గాలిస్తున్నారు.

News January 18, 2025

దొంగతనం చేయలేదు: కరీనా కపూర్

image

సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ఆయన భార్య కరీనా కపూర్ స్టేట్‌మెంట్‌ను ముంబై పోలీసులు నమోదు చేశారు. దుండగుడు సైఫ్‌ను చాలా సార్లు పొడిచాడని ఆమె తెలిపారు. తమ కుమారుడు జహంగీర్ వద్దకు వెళ్లేందుకు పదే పదే ప్రయత్నించాడని, సైఫ్ అడ్డుకున్నారని పేర్కొన్నారు. కానీ ఇంట్లో ఎలాంటి డబ్బులు, ఆభరణాలు దొంగతనం చేయలేదని పోలీసులకు వెల్లడించారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News January 18, 2025

డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం

image

AP: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభమైంది. ప్రాజెక్టు సీఈ, అధికారులు భూమిపూజ, హోమం నిర్వహించారు. అనంతరం వాల్ కాంక్రీట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.990 కోట్లు ఖర్చు చేయనుంది. సగం నిర్మాణం పూర్తి కాగానే దానిపై సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించనున్నారు.