News April 2, 2024

BREAKING: ఎంపీగా షర్మిల పోటీ.. ఎక్కడి నుంచంటే?

image

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 114 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేయనున్నారు. రాజమండ్రి – గిడుగు రుద్రరాజు, కాకినాడ – పల్లంరాజు, బాపట్ల – జేడీ శీలం, కర్నూలు – రాంపుల్లయ్య యాదవ్ లోక్‌సభ బరిలో ఉన్నారు.

Similar News

News April 16, 2026

IPL: రెండు మ్యాచులకు రోహిత్ శర్మ దూరం?

image

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల RCBతో మ్యాచులో గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన ముంబై ఆడబోయే తర్వాతి రెండు మ్యాచులకు దూరం అయ్యే అవకాశం ఉందని NDTV పేర్కొంది. ఇప్పటికే వరుసగా 3 మ్యాచుల్లో ఓడిన ఆ జట్టుకు హిట్‌మ్యాన్ దూరమవడం పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. కాగా MI రేపు PBKS, ఈ నెల 20న GTతో తలపడనుంది.

News April 16, 2026

పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పించండి: గోయెంకా

image

పిల్లలకు చిన్నతనం నుంచే పొదుపుపై అవగాహన కల్పించాలని పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సూచించారు. వారి ఆదాయాన్ని (పాకెట్ మనీ) మూడు భాగాలుగా విభజించాలని ఆయన పేర్కొన్నారు. ఒకటి పొదుపు/పెట్టుబడి కోసం, రెండోది వ్యక్తిగత వినోదం కోసం, మూడోది కుటుంబ ఉమ్మడి లక్ష్యాల కోసం ‘హోమ్ ట్యాక్స్’గా కేటాయించాలని తెలిపారు. ఈ విధానం వల్ల పిల్లల్లో బాధ్యత, ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

News April 15, 2026

మహిళా బిల్లుకే మా మద్దతు.. డీలిమిటేషన్‌కు లేదు: ఖర్గే

image

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. అయితే డీలిమిటేషన్ బిల్లుకు తాము పూర్తి వ్యతిరేకమని అన్నారు. డీలిమిటేషన్‌ పేరుతో కేంద్రం గారడీలు చేస్తోందని.. జనాభా లెక్కలపై ఎలాంటి క్లారిటీ లేదని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్పష్టం చేశారు. ఇండీ కూటమి నేతల సమావేశం అనంతరం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.