News March 21, 2024
BREAKING: ఢిల్లీ సీఎంకు షాక్

ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ED అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. మరోవైపు కేజ్రీవాల్ పిటిషన్‌పై స్పందించాలని ఈడీకి సూచిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.
Similar News
News November 17, 2025
APPLY NOW: IAFలో 340 పోస్టులు

IAF వివిధ విభాగాల్లో 340 పోస్టుల భర్తీకి AFCAT-1/2026 దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్‌లో కనీసం 50% మార్కులు, డిగ్రీలో 60% మార్కులు సాధించినవారు లేదా BE/ బీటెక్ చేసినవారు డిసెంబర్ 14వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 -26 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://afcat.cdac.in/

డిజిటల్ అరెస్టు అంటూ ₹32 CRకు టోపీ

సైబర్ ఫ్రాడ్‌కు చిక్కి బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఏకంగా ₹32 CR మేర పోగొట్టుకుంది. పాస్‌పోర్టులు, క్రెడిట్ కార్డులు, డ్రగ్స్‌తో కొరియర్ వచ్చిందని, ఇది క్రైమ్ అని ఆమెకు ముందు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆపై నేరగాళ్లు డిజిటల్ అరెస్టు అని నెల రోజులు స్కైప్, కాల్స్‌తో నిఘా పెట్టారు. RBI FIU పేరిట ఆస్తులు ఇతర చిట్టా అడిగారు. వాటి క్లియరెన్స్ పేరిట ₹32 కోట్లు తీసుకున్నారు. మోసంపై ఆమె ఆలస్యంగా ఫిర్యాదు చేశారు.