News March 21, 2024

BREAKING: ఢిల్లీ సీఎంకు షాక్

image

ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ED అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. మరోవైపు కేజ్రీవాల్ పిటిషన్‌పై స్పందించాలని ఈడీకి సూచిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.

Similar News

News September 12, 2024

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

image

పెన్షన్ల జారీలో ఆలస్యంతో ఉద్యోగుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు పదవీ విరమణ చేసే నాటికి పెన్షన్ కచ్చితంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ విభాగం ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. CSS రూల్ 2021లో పేర్కొన్నట్లు నిర్ణీత కాలంలో పెన్షన్ మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలంది.

News September 11, 2024

మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి

image

తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి నియమితులయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ బులిటెన్ జారీ చేశారు. ఈ ఏడాది జులై 25న మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారిని పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. ఆయనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని అసెంబ్లీ సెక్రటరీకి లేఖ అందించారు.

News September 11, 2024

తండ్రి ఆత్మహత్య.. నటి ఎమోషనల్ పోస్ట్

image

తండ్రి అనిల్ మెహతా <<14074510>>మరణంపై<<>> బాలీవుడ్ నటి మలైకా అరోరా ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘ఆయన ఎంతో సౌమ్యుడు. ప్రేమగల భర్త, మంచి గ్రాండ్ ఫాదర్, మా బెస్ట్ ఫ్రెండ్. ఈ ఘటనతో మా కుటుంబమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇలాంటి సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించొద్దని మీడియా, శ్రేయోభిలాషులను కోరుతున్నా. కష్టసమయంలో అండగా నిలిచిన వారందరీకి కృతజ్ఞతలు’ అని ఆమె రాసుకొచ్చారు.