News April 7, 2024
BREAKING: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్
TG: మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. రద్దీ పెరగడంతో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.59 హాలిడే కార్డుతో పాటు మెట్రో కార్డుపై ఇచ్చే 10శాతం రాయితీని రద్దు చేశారు. మరోవైపు ఎండల తీవ్రతతో మెట్రో ప్రయాణానికి డిమాండ్ పెరిగింది. రాయితీలను రద్దు చేయడంతో ప్రయాణికుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలాగే కోచ్‌ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News November 13, 2024
తన క్యాన్సర్‌ను తనే నయం చేసుకున్న శాస్త్రవేత్త!
క్రొయేషియాకు చెందిన సైంటిస్ట్ బియాటా హలాసీ(49) జాగ్రేబ్ వర్సిటీలో వైరాలజిస్టుగా పనిచేస్తున్నారు. ఆమెకు గతంలో రొమ్ము క్యాన్సర్ సోకి తగ్గింది. 2020లో మళ్లీ సోకగా సొంతంగా ఆంకాలిటిక్ వైరోథెరపీని(OVT) చేసుకున్నారు. పొంగు చూపే వైరస్, వెసిక్యులర్ స్టొమాటిటిస్ వైరస్(VSV) రెండింటినీ తన కణితిపై ప్రయోగించి క్యాన్సర్ నుంచి విముక్తురాలయ్యారు. వైద్య ప్రపంచంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
News November 13, 2024
ICC ర్యాంకింగ్స్.. నం.1 ప్లేస్‌లో పాక్ బౌలర్
ICC తాజాగా ప్రకటించిన వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పాక్ బౌలర్ షాహీన్‌షా అఫ్రీది నంబర్ 1 ర్యాంక్ సాధించారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అతడు అద్భుతమైన ప్రదర్శన చేశారు. మూడు వన్డేల్లో 8 వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్‌కు ముందు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 4వ ప్లేస్‌లో ఉన్న అఫ్రీది ఏకంగా తొలి స్థానానికి దూసుకొచ్చారు. IND తరఫున కుల్దీప్(4), బుమ్రా(6), సిరాజ్(8) టాప్-10లో ఉన్నారు.
News November 13, 2024
చంద్రబాబుకు అప్పు రత్న బిరుదు ఇవ్వాలి: జగన్
AP: చంద్రబాబు హయాంలో అప్పులు 19శాతం పెరిగితే, తాను సీఎంగా ఉన్న కాలంలో 15శాతం మాత్రమే పెరిగినట్లు YS జగన్ వెల్లడించారు. రూ.10 లక్షల కోట్లు, రూ.14లక్షల కోట్ల అప్పు అని తమపై తప్పుడు ప్రచారం చేసి, బడ్జెట్‌లో రూ.6లక్షల కోట్ల అప్పు మాత్రమే చూపించారని ఆరోపించారు. అంటే చంద్రబాబు, కూటమి నేతలు చేసిందంతా తప్పుడు ప్రచారం కాదా? అని ప్రశ్నించారు. అప్పు రత్న అనే బిరుదును చంద్రబాబుకు ఇవ్వాలని సెటైర్లు వేశారు.