News March 21, 2024

BREAKING: వాలంటీర్లకు షాక్

image

AP: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రచారాల్లో పాల్గొంటున్న వాలంటీర్లపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నారు. మచిలీపట్నంలో YCP అభ్యర్థి పేర్ని కిట్టు ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు, పొదిలిలో ముగ్గురు, మైలవరంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న 11 మంది వాలంటీర్లు, గుంటూరు జిల్లా చేబ్రోలులో వైసీపీ ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్న 45 మంది వాలంటీర్లపై వేటు వేశారు. ఇటీవలే 19 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.

Similar News

News October 19, 2025

‘K-Ramp’ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

image

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని తెరకెక్కించిన ‘K-Ramp’ మూవీ నిన్న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టినట్లు Sacnilk ట్రేడ్ వెబ్‌సైట్ తెలిపింది. ఇండియాలో రూ.2.15 కోట్లు(నెట్ కలెక్షన్స్) వసూలు చేసినట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో 37.10% ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు వెల్లడించింది.

News October 19, 2025

తొలి వన్డే.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం

image

పెర్త్‌లో జరుగుతున్న ఆస్ట్రేలియా, భారత్ తొలి వన్డేకు వరుణుడు ఆటంకం కలిగించాడు. 9వ ఓవర్ నడుస్తుండగా వర్షం పడటంతో మ్యాచ్ ఆపేశారు. ప్రస్తుతం క్రీజులో అయ్యర్(2), అక్షర్ పటేల్(0) ఉన్నారు. రోహిత్, కోహ్లీల తర్వాత గిల్(10) కూడా ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 25/3గా ఉంది.

News October 19, 2025

ఒకే అభ్యర్థి రెండు పార్టీల తరఫున నామినేషన్.. ఎందుకంటే?

image

ఒకే అభ్యర్థి 2, 3 స్థానాల్లో పోటీ చేయడం కామన్. కానీ ఒకే చోట 2 పార్టీల తరఫున పోటీ చేయడం చూశారా? బిహార్‌లోని ఆలమనగర్‌లో నబిన్ కుమార్ అనే అభ్యర్థి ముందుగా RJD తరఫున నామినేషన్ దాఖలు చేశారు. సీట్ల సర్దుబాటులో మహా కూటమి స్థానిక పార్టీ VIPకి కేటాయించింది. విషయం తెలిసి వీఐపీ నుంచి నామినేషన్ చేశారు. 2 పార్టీల తరఫున పోటీలో ఉన్నారనే ఫొటోలు వైరలవ్వడంతో RJD నుంచి నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.