News March 21, 2024
BREAKING: వాలంటీర్లకు షాక్
AP: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రచారాల్లో పాల్గొంటున్న వాలంటీర్లపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నారు. మచిలీపట్నంలో YCP అభ్యర్థి పేర్ని కిట్టు ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు, పొదిలిలో ముగ్గురు, మైలవరంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న 11 మంది వాలంటీర్లు, గుంటూరు జిల్లా చేబ్రోలులో వైసీపీ ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్న 45 మంది వాలంటీర్లపై వేటు వేశారు. ఇటీవలే 19 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.
Similar News
News September 17, 2024
కొత్త రేషన్ కార్డుల అంశంపై ప్రజల్లో సందేహాలు
TG: రేషన్ కార్డులను విభజించి స్మార్ట్ రేషన్ కార్డులు, స్మార్ట్ హెల్త్ కార్డులు ఇస్తామని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కార్డుల జారీకి లబ్ధిదారుల ఆదాయ పరిమితి, అర్హతలపై నిబంధనలను పున:సమీక్షిస్తామని చెప్పడంతో ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. బియ్యం అవసరం లేని వారికి స్మార్ట్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పడంపైనా అనుమానాలున్నాయి. ఈ నెల 21న ఈ అంశంపై తుది నిర్ణయం రానుంది.
News September 17, 2024
జానీని ‘మాస్టర్’ అని పిలవొద్దు: హీరోయిన్
డాన్స్ కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ జానీని ఇక నుంచి మాస్టర్ అని పిలవొద్దు. ‘మాస్టర్’ అనే పదానికి కాస్త గౌరవం ఇవ్వండి’ అని ట్వీట్ చేశారు. జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఓ యువతి ఆయన తనను లైంగికంగా వేధించాడని, అత్యాచారం చేశాడని రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
News September 17, 2024
నేడు సమీక్షలతో బిజీగా సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు ఇవాళ పలు శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. నూతన ఎక్సైజ్ పాలసీ, బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్, టెక్స్ టైల్స్ శాఖలపై మంత్రులు, అధికారులతో సమీక్షించనున్నారు. అలాగే భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు అందించే సాయంపై నేడు సాయంత్రం కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.