News May 26, 2024
IPL: ఫైనల్లో SRH 113 రన్స్కే ఆలౌట్

KKRతో జరుగుతున్న IPL ఫైనల్లో SRH బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టులో ఎవరూ రాణించలేదు. హెడ్ గోల్డెన్ డక్ అవగా.. కెప్టెన్ కమిన్స్ 24 టాప్ స్కోరర్. మార్క్రమ్ 20, క్లాసెన్ 16, నితీశ్ 13, త్రిపాఠి 9, షాబాజ్ 8, సమద్ 4 రన్స్కే పరిమితమయ్యారు. దీంతో SRH 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. KKR బౌలర్లలో రసెల్ 3, స్టార్క్, హర్షిత్ చెరో 2 వికెట్లు తీశారు.
Similar News
News November 27, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో KCR మాజీ ఓఎస్డీ విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ CM KCR వద్ద OSDగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని జూబ్లీహిల్స్ PSలో సిట్ విచారిస్తోంది. దీంతో ఆయన ఎలాంటి సమాచారం ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. INC ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టి సారించింది. ఈ కేసులో మాజీ IPS ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించింది. పలువురు రాజకీయ ప్రముఖుల వాంగ్మూలాలను సిట్ రికార్డ్ చేసింది.
News November 27, 2025
రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రివ్యూ&రేటింగ్

హీరో కష్టాన్ని తీర్చేందుకు అభిమాని ఏం త్యాగం చేశాడనేదే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ స్టోరీ. ఫ్యాన్ బయోపిక్గా తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరో పాత్రలో ఉపేంద్ర, అభిమాని రోల్లో రామ్ అద్భుతంగా నటించారు. రామ్, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. సాంగ్స్, ఎమోషనల్ సీన్లు ప్లస్ కాగా లెన్తీ, ఊహించే సీన్లు, స్లో నరేషన్ మైనస్.
రేటింగ్- 2.75/5
News November 27, 2025
పార్టీ నిర్ణయిస్తే సీఎంగా డీకేను స్వాగతిస్తాం: పరమేశ్వర

కర్ణాటకలో CM మార్పుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను కూడా సీఎం ఆశావహుల్లో ఉన్నా. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కూడా ఆ పదవికి తగిన అభ్యర్థే. కానీ ఆ పోస్టుకు హైకమాండ్ DK శివకుమార్ను నిర్ణయిస్తే స్వాగతిస్తాం. పార్టీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో అధిష్ఠానానికి తెలుసు. ప్రస్తుత సీఎం సిద్దరామయ్య, డీకే మధ్య డీల్ గురించి నాకు తెలియదు’ అని పేర్కొన్నారు.


