News May 26, 2024

IPL: ఫైనల్లో SRH 113 రన్స్‌కే ఆలౌట్

image

KKRతో జరుగుతున్న IPL ఫైనల్లో SRH బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టులో ఎవరూ రాణించలేదు. హెడ్ గోల్డెన్ డక్ అవగా.. కెప్టెన్ కమిన్స్ 24 టాప్ స్కోరర్. మార్క్రమ్ 20, క్లాసెన్ 16, నితీశ్ 13, త్రిపాఠి 9, షాబాజ్ 8, సమద్ 4 రన్స్‌కే పరిమితమయ్యారు. దీంతో SRH 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. KKR బౌలర్లలో రసెల్ 3, స్టార్క్, హర్షిత్ చెరో 2 వికెట్లు తీశారు.

Similar News

News February 18, 2025

9 మంది ESI ఆస్పత్రి ఉద్యోగులను సస్పెండ్ చేసిన మంత్రి

image

AP: రాజమహేంద్రవరం ESI ఆస్పత్రిలో 9మంది ఉద్యోగులపై సన్పెన్షన్ వేటు పడింది. కొందరు వైద్యులు, సిబ్బంది విధుల్లో లేకుండా సంతకాలు పెట్టి వెళ్లడాన్ని నిన్నటి ఆకస్మిక పర్యటనలో మంత్రి వాసంశెట్టి సుభాష్ గుర్తించి మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించగా.. రాష్ట్ర బీమా వైద్య సేవల డైరెక్టర్ ఆంజనేయులు ఇవాళ సస్పెండ్ చేశారు. ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌, ముగ్గురు డ్యూటీ డాక్టర్లు తదితరులపై వేటు పడింది.

News February 18, 2025

బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరానిది: PM

image

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరానిదని, ఇది మరింత బలపడుతోందని తెలిపారు. అభివృద్ధి రాజకీయాలకు ఇది పెద్ద విజయం అని అభివర్ణించారు. GJలో 1912 వార్డులకు గాను బీజేపీ 1402, కాంగ్రెస్ 260, ఎస్పీ, ఆప్ కలిసి 236 వార్డులు గెలుచుకున్నాయి. 68 మున్సిపాలిటీల్లో బీజేపీ 57, కాంగ్రెస్ 1, ఎస్పీ 2, ఇతరులు 3 చోట్ల విజయం సాధించాయి.

News February 18, 2025

ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఎల్లుండి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి జరగాల్సిన ఏపీ క్యాబినెట్ భేటి వాయిదా పడింది.

error: Content is protected !!