News April 4, 2025
BREAKING: SRH ఘోర ఓటమి

SRH హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై KKR 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆరెంజ్ ఆర్మీ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. క్లాసెన్ 33, కమిందు 27, నితీశ్ 19, కమిన్స్ 14 మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. వైభవ్, వరుణ్ చెరో 3 వికెట్లు, రస్సెల్ 2, హర్షిత్, నరైన్ చెరో వికెట్ తీశారు.
Similar News
News April 4, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ మలయాళ నటుడు రవి కుమార్(71) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1968లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవికుమార్ 150కిపైగా మలయాళ, తమిళ చిత్రాలు, అనేక సీరియళ్లలో నటించారు. ‘అనుబంధం’ సీరియల్‌తో పాటు రజినీకాంత్ శివాజీ మూవీలో మినిస్టర్ పాత్రతో తెలుగులోనూ గుర్తింపు పొందారు. ఆయన మృతిపై రాధికా శరత్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.
News April 4, 2025
ఒకేసారి ఆస్తి పన్ను చెల్లిస్తే 5% రాయితీ

AP: 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒకేసారి ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. ఈ నెల 30లోగా చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించింది.
News April 4, 2025
టారిఫ్ లిస్టులో పెంగ్విన్ ద్వీపం.. ట్రంప్.. పాపం!

ట్రంప్ టారిఫ్ లిస్ట్ ప్రపంచాన్ని కలవరపెడుతుంటే సోషల్ ప్రపంచం మాత్రం ఆయన్ను ఆడేసుకుంటోంది. ప్రతీకార సుంకాల లిస్టులో ఆస్ట్రేలియా పరిధిలోని మెక్‌డొనాల్డ్ ద్వీపం (అంటార్కిటికా ఖండ ఉపభాగం) కూడా ఉంది. ఈ ద్వీపంలో మనుషులే ఉండరు. పెంగ్విన్లు మాత్రమే నివసించే ఈ ప్రాంతం కూడా 10% దిగుమతి టారిఫ్‌కు గురవడంతో మీమర్స్ బుర్రను షార్ప్ చేసి ట్రంప్‌ను చెక్కేస్తున్నారు. పైన గ్యాలరీలో మీరు కొన్ని మీమ్స్ చూడవచ్చు.