News March 23, 2025
BREAKING: SRH విజయం.. పోరాడి ఓడిన RR

IPL-2025: HYDలోని ఉప్పల్‌లో RRతో జరిగిన మ్యాచ్‌లో SRH 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 287 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ పోరాడి ఓడింది. ఈ క్రమంలో 6 వికెట్లు కోల్పోయి 242 రన్స్ చేసింది. RR బ్యాటర్లు రన్‌రేట్ 10కి తగ్గకుండా బ్యాటింగ్ చేసినా కొండంత లక్ష్యం కరగలేదు. జురేల్(70), శాంసన్(66) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది. సమర్జీత్, హర్షల్ తలో 2 వికెట్లు తీశారు.
Similar News
News April 22, 2025
అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు

TG: కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్న అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని AISF తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసింది. JEE మెయిన్ ఫలితాల్లో తప్పుడు ర్యాంకులను ప్రచారం చేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాలపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
News April 22, 2025
హిరోషిమాలో అణుబాంబు మృతులకు CM రేవంత్ నివాళులు

తెలంగాణ CM రేవంత్ జపాన్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన ఇవాళ హిరోషిమా పీస్ మెమోరియల్ పార్కును సందర్శించి అణుబాంబు మృతులకు నివాళులు అర్పించారు. అలాగే, దాడి జరిగిన ప్రాంతంలో శాంతికి చిహ్నంగా ఏర్పాటు చేసిన డోమ్‌ను సైతం సందర్శించారు. CMతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, జపాన్ ప్రతినిధులు ఉన్నారు. 1945లో 2వ ప్రపంచ యుద్ధం వేళ జపాన్‌పై US అణుబాంబుతో దాడి చేసిన విషయం తెలిసిందే.
News April 22, 2025
CSKకు గెలవాలనే కసి లేదు: రైనా

ఐపీఎల్ 2025లో సీఎస్కేకు గెలవాలనే తపన, కసి లేవని ఆ జట్టు మాజీ ప్లేయర్ సురేశ్ రైనా అన్నారు. ప్రస్తుతం అన్ని జట్లకన్నా సీఎస్కేనే బలహీనంగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘జట్టులోని ఆటగాళ్లకు అసలు అంకితభావం, చిత్తశుద్ధి లేనట్లుగా కనిపిస్తోంది. ఇది నేను వారిని అవమానిస్తున్నట్లు కాదు. గతంలో సీఎస్కేకు ఉండే బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు కనిపించడం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.