News May 24, 2024
BREAKING: శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

AP: ఆగస్టు నెల కోటాకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల(రూ.300)ను టీటీడీ విడుదల చేసింది. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ స్పెషల్ ఎంట్రీ దర్శనం(రూ.200) టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. భక్తులు <
Similar News
News February 9, 2025
NRIలు, NRTS సభ్యులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులకు ఇకపై రోజుకు 100 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను TTD కేటాయించనుంది. అలాగే శ్రీవారి దర్శనం కోసం వచ్చే NRIలు, విదేశీయులకు సుపథం మార్గంలో రూ.300 కోటాలో దర్శనం కల్పించనుంది. స్టాంపింగ్ తేదీ నుంచి నెలలోపు దర్శనం కల్పించనుంది. ఒరిజినల్ పాస్‌పోర్టుతో ఉ.10 నుంచి సా.5 గంటలోపు వచ్చిన వారికి టోకెన్లు ఇస్తారు. బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల టైంలో టోకెన్లు ఇవ్వరు.
News February 9, 2025
GBS కలకలం.. రాష్ట్రంలో తొలి మరణం

తెలంగాణలో తొలి GBS(గిలియన్ బార్ సిండ్రోమ్) <<15404745>>మరణం <<>>సంభవించింది. ఈ వ్యాధితో బాధపడుతున్న మహిళ ప్రాణాలు విడిచింది. సిద్దిపేట సమీపంలోని సీతారాంపల్లికి చెందిన వివాహిత(25) నెల రోజుల క్రితం నరాల నొప్పులతో స్థానిక ఆస్పత్రిలో చేరింది. ఆ తర్వాత HYD నిమ్స్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. నిన్న చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
News February 9, 2025
కరీబియన్ సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక

హోండురస్‌కు ఉత్తర దిక్కున కరీబియన్ సముద్రంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. సముద్రానికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని జర్మన్ రిసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ సంస్థ తెలిపింది. ఈ ప్రాంతంలో 2021 తర్వాత ఇదే అతి పెద్ద భూకంప తీవ్రత కావడంతో కరీబియన్ సముద్రం చుట్టపక్కల ఉన్న హోండురస్, ప్యూర్టోరికో, వర్జిన్ ఐలాండ్స్‌కు అమెరికా సముద్ర, పర్యావరణ పరిశీలన సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.