News November 11, 2024

BREAKING: బాసర IIITలో విద్యార్థిని సూసైడ్

image

TG: నిర్మల్ జిల్లాలోని బాసర RGUKT హాస్టల్ గదిలో విద్యార్థిని స్వాతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లా పెర్కిట్‌కు చెందిన ఆమె పీయూసీ రెండో ఏడాది చదువుతోంది. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

Similar News

News December 9, 2025

గ్లోబల్ సమ్మిట్‌‌లో భారీ డ్రోన్ షో.. గిన్నిస్ రికార్డు

image

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ ముగింపు వేడుకల్లో ప్రభుత్వ లక్ష్యాలను ఆవిష్కరిస్తూ నిర్వహించిన భారీ డ్రోన్ షో ఆకట్టుకుంది. 3 వేల డ్రోన్లతో నిర్వహించిన ఈ ప్రదర్శన గిన్నిస్ రికార్డు నమోదు చేసింది. UAE పేరిట ఉన్న రికార్డును తెలంగాణ బ్రేక్ చేసింది. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని సీఎం రేవంత్ అందుకున్నారు.
* డ్రోన్ షో ఫొటో గ్యాలరీని పైన చూడండి.

News December 9, 2025

విజృంభిస్తున్న భారత బౌలర్లు

image

సౌతాఫ్రికాతో తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. సఫారీ జట్టు టాపార్డర్‌ను కుప్పకూల్చారు. అర్ష్‌దీప్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ డికాక్‌ను డకౌట్ చేశారు. తర్వాత స్టబ్స్(14)ను వెనక్కి పంపారు. మార్క్రమ్(14)ను అక్షర్ బౌల్డ్ చేయగా, డేవిడ్ మిల్లర్(1)ను పాండ్య పెవిలియన్‌కు పంపారు. ఫెరీరా(5)ను వరుణ్ ఔట్ చేశారు. దీంతో SA 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.