News November 11, 2024
BREAKING: బాసర IIITలో విద్యార్థిని సూసైడ్
TG: నిర్మల్ జిల్లాలోని బాసర RGUKT హాస్టల్ గదిలో విద్యార్థిని స్వాతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లా పెర్కిట్‌కు చెందిన ఆమె పీయూసీ రెండో ఏడాది చదువుతోంది. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
Similar News
News December 13, 2024
ఈ నెల 16న క్యాబినెట్ భేటీ
TG: ఈ నెల 16న సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరుగనుంది. అసెంబ్లీలో కమిటీ హాల్‌లో జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు చట్ట సవరణ బిల్లులకు క్యాబినెట్ ఆమోదం పలుకుతుందని తెలుస్తోంది.
News December 13, 2024
నేటి ‘గూగుల్’ డూడుల్ గమనించారా?
దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్న ‘వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్’ విజయాన్ని ‘గూగుల్’ తనదైన శైలిలో జరుపుకుంది. తన డూడుల్‌ను చెస్ కాయిన్స్‌గా మార్చేసింది. ‘64 నలుపు & తెలుపు చతురస్రాల్లో ఇద్దరు ఆటగాళ్లు ఆడిన వ్యూహాత్మక గేమ్‌ను తలపించేలా డూడుల్‌ను రూపొందించాం’ అని గూగుల్ తెలిపింది. కాగా, నిన్న జరిగిన ఛాంపియన్షిప్‌లో భారత చెస్ ప్లేయర్ గుకేశ్ గెలుపొంది సత్తాచాటారు.
News December 13, 2024
OTTలోకి వచ్చేసిన ‘మెకానిక్ రాకీ’
విశ్వక్‌సేన్ హీరోగా నటించిన ‘మెకానిక్ రాకీ’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. రవితేజ ముళ్లపూడి తెరకెక్కించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సునీల్, హైపర్ ఆది, నరేశ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా గత నెల 22న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయిందని సినీ వర్గాల విశ్లేషణ.