News February 6, 2025

BREAKING: విద్యార్థులకు సూపర్ న్యూస్

image

AP: మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై సన్నబియ్యం అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’పై మంత్రివర్గం చర్చించగా.. మెనూలో తీసుకొచ్చిన మార్పులను మంత్రి లోకేశ్ వివరించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే ఆహారాలను మెనూలో పెట్టనున్నట్లు చెప్పారు. లోకేశ్ చేసిన సన్నబియ్యం ప్రతిపాదనకు మంత్రి నాదెండ్ల మనోహర్ సహా ఇతర మంత్రులు అంగీకారం తెలిపారు.

Similar News

News January 14, 2026

ఈ నెల 19 నుంచి సర్పంచులకు ట్రైనింగ్

image

TG: రాష్ట్రంలో 12,728 పంచాయతీలకు గత నెలలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 28 వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రకటించింది. జిల్లాలు, బ్యాచుల వారీగా 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు ఉండనున్నాయి. ఒక్కో బ్యాచులో 50 మంది ఉండనున్నారు.

News January 14, 2026

కేశాలకు కర్పూరం

image

కురులు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కర్పూరం నూనెను వాడాలంటున్నారు నిపుణులు. కర్పూరాన్ని మెత్తగా పొడి చేసుకొని నూనెలో వేసి 5నిమిషాలు మరిగించాలి. దీన్ని రాత్రి జుట్టు కుదుళ్లకు రాసి తర్వాత రోజు తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. చుండ్రు, జుట్టు పొడిబారడం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. తెల్ల జుట్టును తగ్గించడంలోనూ కర్పూరం ఉపయోగపడుతుంది.

News January 14, 2026

సంక్రాంతిని ఎవరెలా చేస్తారంటే?

image

సంక్రాంతిని దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకుంటారు. కేరళలో మకరజ్యోతి దర్శనం, తమిళనాడులో పొంగల్, పంజాబ్‌లో మాంగి, అస్సాంలో బిహుగా పిలుస్తారు. గుజరాత్‌లో సిదా పేరిట సోదరీమణులకు బహుమతులిస్తారు. UPలో కిచెరి, ఒడిశాలో మకర చౌలాగా ప్రసిద్ధి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కోడి, పొట్టేళ్ల పందేలతో కోలాహలంగా ఉంటుంది. పేరు ఏదైనా ప్రకృతిని పూజించడం, దానాలు చేయడం, బంధువులతో కలిసి ఆనందాన్ని పంచుకోవడం కామన్.