News December 19, 2024

BREAKING: టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి.
*మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్
*22న సెకండ్ లాంగ్వేజ్
*24న ఇంగ్లిష్
*26న మ్యాథ్స్
*28న ఫిజిక్స్
*29న బయోలజీ
*ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్
>>ఏప్రిల్ 3న ఒకేషనల్ కోర్సు పేపర్-1 భాషా పరీక్ష, ఏప్రిల్ 4న ఒకేషనల్ కోర్సు పేపర్-2 భాషా పరీక్ష

Similar News

News February 8, 2026

కలర్ ఫుల్‌గా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ!

image

ప్రశాంత్ నీల్ సినిమాలు అనగానే గ్రే/బ్లాక్ కలర్ షేడ్‌లో ఉంటాయనే పేరుంది. అయితే ఎన్టీఆర్‌తో తీస్తున్న సినిమా కలర్ ఫుల్‌గా ఉండనుందని తెలుస్తోంది. రెగ్యులర్ స్టైల్‌లో కాకుండా కొత్త టేకింగ్‌తో తీస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం సన్నబడిన ఆయన భారీగా గడ్డం కూడా పెంచారు. కాగా సమ్మర్‌లో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుందని టాక్.

News February 8, 2026

రెండో టీ20కి భారత జట్టుతో చేరనున్న సుందర్: సూర్య

image

గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ రెండో టీ20కి అందుబాటులో ఉంటారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగే మ్యాచులో జట్టులో చేరుతారని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే సమయంలో సుందర్ గాయపడ్డారు. ఆ సిరీస్‌‌లో సుందర్ స్థానంలో బదోనిని తీసుకున్నా T20WC స్క్వాడ్‌లో మాత్రం ఆయన స్థానాన్ని రీప్లేస్ చేయలేదు. ఆల్‌రౌండర్ సుందర్ రాకతో భారత్ మరింత పటిష్టంగా మారనుంది.

News February 8, 2026

సెట్‌లో తాగుబోతును చితకబాదా: సాయి ధన్సిక

image

తాను నటించిన ‘యోగిడా’ మూవీ సెట్‌లో ఓ వ్యక్తిని చితకబాదినట్లు హీరోయిన్ సాయి ధన్సిక తెలిపారు. ‘కేరళలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఫొటో దిగేందుకు వచ్చాడు. అతడు తాగి ఉండటంతో ఫొటో ఇచ్చేందుకు నా అంకుల్ ఒప్పుకోలేదు. దీంతో అంకుల్‌ని కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అది చూసి కోపంలో పరిగెత్తుకుంటూ వెళ్లి అతడిని చితకబాదా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరో విశాల్‌తో ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ జరిగింది.