News March 9, 2025
BREAKING: టెన్త్ హాల్‌టికెట్లు విడుదల

ఏపీ ఓపెన్ టెన్త్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉ.9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు మనమిత్ర వాట్సాప్ నంబర్ లేదా స్టడీ కేంద్రాల ద్వారా హాల్‌టికెట్లు పొందవచ్చు. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <
Similar News
News April 1, 2026
కళ్లు అదురుతున్నాయా? 7 కారణాలివే

కళ్లు అదరడం అనారోగ్య సమస్యకు సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి/ఆందోళన, అలసట, కెఫిన్/ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం, పోషకాహార లోపం, పొల్యూషన్ వల్ల వచ్చే ఐ అలెర్జీ, మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వంటి 7 అంశాలు దీనికి కారణాలు కావచ్చని పేర్కొంటున్నారు. కళ్లు అదరడం వారానికి మించి కొనసాగితే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News April 1, 2026
అమరావతిని ఇంచు కూడా కదలించలేరు: CBN

AP: రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతేనని ఇక దాన్ని ఇంచు కూడా ఎవరూ కదిలించలేరని CM CBN వ్యాఖ్యానించారు. ‘అమరావతి బిల్లును లోక్‌సభలో ఇవాళ పెట్టారు. రేపు రాజ్యసభలో ఆమోదిస్తారు. గత పాలకులు అమరావతిని విధ్వంసం చేశారు. ఎడారి అని, శ్మశానమని ఎగతాళి చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు’ అని నెల్లూరు జిల్లా వింజమూరు సభలో విమర్శించారు. అటు తల్లికి వందనం నిధులను జూన్‌లో అందిస్తామని CBN తెలిపారు.
News April 1, 2026
ఉమెన్స్ క్రికెట్‌లో సంచలనం.. భారత రికార్డు బ్రేక్

మహిళల క్రికెట్‌లో సంచలనం నమోదైంది. అత్యధిక పరుగులను ఛేదించిన జట్టుగా టీమ్ఇండియా(341) పేరిట ఉన్న రికార్డును న్యూజిలాండ్ బద్దలుకొట్టింది. NZతో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 346 పరుగులు చేసింది. ఛేదనలో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన చేసింది. 49.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. అమెలియా కేర్ 139 బంతుల్లోనే 179* పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. ఇసబెల్లా 68 పరుగులతో రాణించారు.


