News April 11, 2025
BREAKING: టెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నోటిఫికేషన్పై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. జూన్ 15 నుంచి 30 మధ్య ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. పూర్తి నోటిఫికేషన్ వివరాలు APR 15 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. కాగా ఏడాదికి 2సార్లు టెట్ నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. 2024 NOVలో నోటిఫికేషన్ రాగా, ఈ JANలో ఎగ్జామ్స్ జరిగాయి. FEBలో రిజల్ట్స్ ప్రకటించారు.
Similar News
News October 20, 2025
మీకు తెలుసా? దేవతల పుత్రుడే ‘నరకాసురుడు’

కృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురుడ్ని చంపి, వెలుగు నింపినందుకు గుర్తుగా మనం దీపావళి జరుపుకుంటాం. అయితే ఆ నరకాసురుడు దేవతల పుత్రుడే అని మీకు తెలుసా? విష్ణుమూర్తి వరాహ అవతారానికి, భూదేవికి జన్మించిన కుమారుడే ఈ అసురుడు. ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలించిన ఇతను దుష్ట స్వభావాన్ని పెంచుకుని అసురుడిగా మారాడు. అహంకారం పెరిగి 16K రాజకుమార్తెలను బంధించాడు. తన తల్లి చేతిలో తప్ప మరెవరి చేత మరణం లేని వరం ఉండేది.
News October 20, 2025
ఇవాళ బిడ్డల ఇళ్లకు పితృదేవతలు!

దీపావళి నాడు సాయంత్రం పితృదేవతలు ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి తమ సంతానాల గృహాలను సందర్శిస్తారని నమ్మకం. వారికి దారి కనిపించటం కోసమే పిల్లల చేత దివ్వెలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది. వీధి గుమ్మం ముందు దివిటీలను వెలిగించి గుండ్రంగా మూడుసార్లు తిప్పి నేలకు కొట్టిస్తూ ‘దుబ్బు దుబ్బు దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి’ అని పలికిస్తారు.
* మరిన్ని దీపావళి విశేషాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 20, 2025
నరకాసురుడి జననం

దితి, కశ్యప ప్రజాపతి పుత్రుడైన హిరణ్యాక్షుడు భూమండలాన్ని తీసుకుపోయి సముద్ర గర్భంలో దాచాడు. దీంతో భూమిని రక్షించేందుకు శ్రీమహా విష్ణువు వరాహ అవతారాన్ని ధరించాడు. ఆయన తన వజ్ర సమానమైన కోరతో హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని పైకి తీసుకు వచ్చాడు. ఆ సమయంలో భూదేవికి, వరాహ స్వామికి ఒక పుత్రుడు జన్మించాడు. అతడే నరకాసురుడు. అతడు నిషిద్ధమైన సంధ్యా సమయంలో జన్మించడం వల్ల అసుర లక్షణాలు అబ్బుతాయి.