News April 25, 2024

BREAKING: టికెట్లు విడుదల

image

AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 కోటా) టికెట్లను TTD <>ఆన్‌లైన్‌లో<<>> విడుదల చేసింది. తిరుమల, తిరుపతిలో గదుల కోటా టికెట్ల(జులై నెల)ను నేడు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే శ్రీవారి సేవ కోటా టికెట్లను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ టికెట్లను మ.12 గంటలకు, పరకామణి సేవ కోటాను మ.ఒంటి గంటకు విడుదల చేయనుంది.

Similar News

News December 10, 2025

పారిశ్రామిక పార్కుల్లో APదే అగ్రస్థానం

image

AP: దేశవ్యాప్తంగా ఉన్న 4,597 పారిశ్రామిక పార్కుల్లో అత్యధికంగా 638 ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల సహాయమంత్రి జితిన్ ప్రసాద లోక్‌సభలో వెల్లడించారు. MPలు పుట్టా మహేశ్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర 527 పార్కులతో రెండో స్థానంలో, రాజస్థాన్ 460తో మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో 169 పారిశ్రామిక పార్కులు ఉన్నాయన్నారు.

News December 10, 2025

పురుగు మందులు.. రైతులకు సూచనలు

image

ఒకే మందు పొడి మందుగా, నీటిలో కరిగే ద్రావణంగా, గుళికల రూపంలో లభ్యమౌతుంటే.. ఆశించిన తెగులు, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను బట్టి ఎంచుకోవాలి. పొడి మందులు గాలికి ఎగిరిపోయి వాతావరణ కాలుష్యం కలిగించవచ్చు. నీటిలో కరిగే పొడిమందులను సరిగా కలపకపోతే స్ప్రేయర్‌ల నాజిల్స్‌లో చేరి సరిగా పనిచేయవు. నాసిరకం మందులు కలుపుతున్నప్పుడు చర్మం నుంచి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే వీటిని జాగ్రత్తగా వాడాలి.

News December 10, 2025

మొదలైన లారీల బంద్

image

TGలో లారీల టెస్టింగ్, ఫిట్‌నెస్ ఛార్జీలు తగ్గించాలని సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బంద్ పాటిస్తున్నామని తెలిపింది. 13ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్‌నెస్, టెస్టింగ్ కోసం రూ.12 వేలు వసూలు చేసేవారని, తాజాగా రూ.30వేలకు పెంచారని మండిపడ్డారు. అటు APలో లారీ ఓనర్ అసోసియేషన్‌తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో అక్కడ బంద్ తాత్కాలికంగా వాయిదా పడింది.