News August 8, 2024
BREAKING: వినేశ్ ఫొగట్ సంచలన నిర్ణయం

భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. ‘నాపై రెజ్లింగ్ గెలిచింది. నేను ఓడిపోయాను. నా ధైర్యం ఓడిపోయింది. నాకు ఇంక బలం లేదు. గుడ్ బై రెజ్లింగ్ 2001-2024’ అని ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా అధిక బరువు కారణంగా ఫొగట్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. దీంతో చివరి క్షణంలో ఆమె పతకం గెలిచే అవకాశం కోల్పోయారు.
Similar News
News December 6, 2025
పుతిన్ భారత పర్యటనపై చైనా మీడియా ఏమందంటే..?

భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనపై చైనా మీడియా స్పందించింది. 2 దేశాలు ఒంటరిగా లేవని ప్రపంచానికి పంపిన సందేశమని ‘గ్లోబల్ టైమ్స్’ చెప్పింది. ‘భారత్, రష్యా తమ సామర్థ్యాలను సొంతంగా, మరింతగా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. 2 దేశాల మధ్య సమన్వయం, సహకారమే ఇందుకు నిదర్శనం. US, వెస్ట్ ఆంక్షలు ఫలించవు’ అని ఫారిన్ అఫైర్స్ వర్సిటీ ప్రొఫెసర్ లీ హైడాంగ్ చెప్పారని తెలిపింది.
News December 6, 2025
30ల్లోకి వచ్చారా..?

30ల్లోకి అడుగుపెట్టాక చర్మం నెమ్మదిగా సాగే గుణాన్ని కోల్పోతుంది. కేవలం మాయిశ్చరైజర్ ఈ వయసులో సరిపోదు. యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలి. పగలు ఇ, సి విటమిన్లు, గ్రీన్ టీ ఉన్న ఉత్పత్తులు, రాత్రి రెటినాయిడ్ క్రీములు వాడాలి. ఇవి కొలాజన్ ఉత్పత్తిని పెంచడంతోపాటు చర్మంపై ఏర్పడిన ముడతలు, గీతలను తగ్గిస్తాయి. వీటితో పాటు సన్ స్క్రీన్ తప్పనిసరి. ఫేషియల్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం కూడా మంచిది.
News December 6, 2025
తమిళనాడులో ప్రమాదం.. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు మృతి

తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. అర్ధరాత్రి రామనాథపురంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు రామేశ్వరం ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు మరణించగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు విజయనగరం జిల్లా కొరప కొత్తవలస, మరుపల్లికి చెందినవారిగా గుర్తించారు.


