News April 4, 2025

BREAKING: రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం

image

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. కాగా ఈ నెల 2న ఈ బిల్లు లోక్‌సభలో కూడా ఆమోదం పలికిన విషయం తెలిసిందే. సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అర్ధారాత్రి దాటేవరకూ సభలో విస్తృత చర్చ జరిగింది.

Similar News

News April 14, 2025

ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదు: తమన్నా

image

విజయ్ వర్మ‌తో బ్రేకప్ వార్తలు వస్తున్న వేళ తమన్నా పెళ్లిపై స్పందించారు. ప్రస్తుతానికి వివాహం చేసుకునే ఆలోచన లేదని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రేమను వ్యాపారంగా చూస్తే సమస్యలొస్తాయని <<15926914>>మిల్కీ బ్యూటీ,<<>> రిలేషన్‌షిప్‌లో సంతోషం, బాధలను స్వీకరిస్తేనే సంతోషంగా ఉంటామని విజయ్ ఇటీవల కామెంట్ చేశారు. దీంతో వీరు విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వీరిద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు.

News April 14, 2025

ఏపీలో రూ.5,001 కోట్లతో LG కొత్త ప్లాంట్!

image

AP: తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో LG కంపెనీ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. మే 8న దీని ఓపెనింగ్ సెర్మనీ ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం గతేడాది NOVలో 247 ఎకరాలను కేటాయించింది. రూ.5,001 కోట్ల పెట్టుబడులను ఆమోదించింది. ఈ ప్లాంటులో ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, కంప్రెషర్లను తయారు చేయనున్నారు. 1,495 మంది స్థానికులకు ప్రత్యక్ష ఉపాధి కల్గనుంది.

News April 14, 2025

నేటి నుంచి భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్లు: మంత్రులు

image

TG: ఇకపై విద్య, <<16093517>>ఉద్యోగాల్లో<<>> SC వర్గీకరణ అమలు అవుతుందని మంత్రులు దామోదర, ఉత్తమ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. SC వర్గీకరణ నేటి నుంచి అమల్లోకి వస్తుందని, నేటి నుంచి భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం జారీ చేసే అన్ని జాబ్ నోటిఫికేషన్లకు SC వర్గీకరణ వర్తిస్తుందన్నారు. SC వర్గీకరణ గురించి చాలా పార్టీలు మాట్లాడాయని, కానీ దాని కోసం ప్రయత్నం చేయలేదని అన్నారు.

error: Content is protected !!