News March 2, 2025
BREAKING: భారత్ స్కోర్ ఎంతంటే?

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 249/9 స్కోర్ చేసింది. శ్రేయస్ (79), హార్దిక్ (45), అక్షర్ (42) రాణించారు. రోహిత్(15), గిల్ (2), కోహ్లీ(11), రాహుల్ (23), జడేజా(16) నిరాశపరిచారు. NZ బౌలర్లలో హెన్రీ 5 వికెట్లు తీశారు. ఈ మ్యాచులో గెలవాలంటే NZ 50 ఓవర్లలో 250 రన్స్ చేయాలి.
Similar News
News March 26, 2025
జిన్‌పింగ్ కుటుంబీకుల వద్ద భారీగా అవినీతి ఆస్తులు!

దేశంలో అవినీతిని వేటాడుతున్నామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చెబుతుంటారు. కానీ వారి కుటుంబమే రూ.కోటానుకోట్లు వెనకేసిందని రేడియో ఫ్రీ ఏషియా నివేదిక తెలిపింది. ‘2012లో అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి జిన్‌పింగ్ అవినీతి నిరోధక ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీలోని వేలాదిమందిని అరెస్ట్ చేశారు. అయితే తమకున్న ప్రభుత్వ, ప్రైవేటు మార్గాల్లో జిన్‌పింగ్ కుటుంబం భారీగా కూడబెట్టింది’ అని వెల్లడించింది.
News March 26, 2025
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తుల క్యూలైన్ ఎంబీసీ వరకూ ఉంది. ఇక శ్రీవారిని నిన్న 64,252మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 25,943మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.68 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు తెలిపారు.
News March 26, 2025
శ్రేయస్ అయ్యర్.. కమ్‌బ్యాక్ సూపర్!

నిన్నటి IPL మ్యాచ్‌లో ప్లేయర్‌గా(97 రన్స్), కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్ విజయాన్ని అందించారు. BCCI కాంట్రాక్ట్‌ను కోల్పోయాక ఆయన గత ఏడాది రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ, IPL, ఇరానీ ట్రోఫీలను గెలిచారు. అనంతరం పంజాబ్ రూ.26.75 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. ఆ వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కీలక పాత్ర పోషించారు. దీంతో అయ్యర్.. మీ కమ్‌బ్యాక్ సూపర్ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.