News September 18, 2024
కలెక్టరేట్లో లంచం.. పట్టుకున్న ఏసీబీ

TG: కొత్తగూడెం కలెక్టరేట్ ఆఫీసులో ఓ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. రూ.1.14 లక్షలు లంచం తీసుకుంటూ జిల్లా హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ ఏసీబీకి చిక్కాడు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ధ్రువీకరణ కోసం అధికారి లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు డబ్బు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ డీఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలోని బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. ఎవరైనా లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి.
Similar News
News October 22, 2025
జూ.ఎన్టీఆర్ ఫొటోలు మార్ఫింగ్ చేసి..

TG: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతలు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిశారు. కొందరు ఎన్టీఆర్ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన వివరాలు సమర్పించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా SMలో దుష్ప్రచారం చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని సీపీ స్పష్టం చేశారు.
News October 22, 2025
వరల్డ్ క్లాస్ లైబ్రరీ కోసం శోభా గ్రూప్ ₹100 కోట్ల విరాళం

AP: ప్రపంచ అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని CM CBN పేర్కొన్నారు. దుబాయ్ పర్యటనలో ఆయనతో పలు సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో వరల్డ్ క్లాస్ లైబ్రరీకి ‘శోభా గ్రూప్’ ఛైర్మన్ మీనన్ ₹100 కోట్ల విరాళం ప్రకటించారు. రాజధాని నిర్మాణంలోనూ భాగస్వామ్యం కావాలని సీఎం ఆ సంస్థను కోరారు. అంతకు ముందు APలో పెట్టుబడులకు అవకాశాలపై భారత రాయబార కార్యాలయ ప్రతినిధులతో చర్చించారు.
News October 22, 2025
నకిలీ మద్యం కేసు: 7 రోజుల పోలీస్ కస్టడీ!

AP: నకిలీ మద్యం కేసు నిందితులను 7 రోజుల పోలీస్ కస్టడీకి VJA కోర్టు అనుమతి ఇచ్చింది. విజయవాడ జైలులో ఉన్న A2 జగన్ మోహన్‌రావును రేపు, నెల్లూరు జైలులో ఉన్న A1 జనార్దన్‌రావును ఎల్లుండి కస్టడీలోకి తీసుకోనున్నారు. A13 తిరుమలశెట్టి శ్రీనివాస్‌నూ కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్ దాఖలు చేయగా విచారణ రేపటికి వాయిదా పడింది. అటు జనార్దన్‌రావు బెయిల్ పిటిషన్‌పై విచారణ కూడా కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.