News September 18, 2024
కలెక్టరేట్‌లో లంచం.. పట్టుకున్న ఏసీబీ
TG: కొత్తగూడెం కలెక్టరేట్ ఆఫీసులో ఓ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. రూ.1.14 లక్షలు లంచం తీసుకుంటూ జిల్లా హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ ఏసీబీకి చిక్కాడు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ధ్రువీకరణ కోసం అధికారి లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు డబ్బు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ డీఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలోని బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. ఎవరైనా లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి.
Similar News
News October 4, 2024
పెళ్లి సందడి.. ఈ సీజన్‌లో 48 లక్షల పెళ్లిళ్లు!
రెండు నెలల విరామం తర్వాత నవంబర్ 12 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలవనుంది. 45రోజుల పాటు సాగే ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా 48 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. వీటికోసం రూ.6 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు భారతీయులు సిద్ధమవుతున్నారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) సర్వే పేర్కొంది. ఒక్క ఢిల్లీలోనే 4.5 లక్షల పెళ్లిళ్ల ద్వారా రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగనుందని తెలిపింది.
News October 4, 2024
కేంద్రం ఇప్పటికీ ఆ నిధులు ఇవ్వలేదు: సీఎం పినరయి
వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో పునరావాసం కోసం కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందించలేదని CM పినరయి విజయన్ తెలిపారు. ఈ ప్రాంతంలో PM మోదీ తన పర్యటన సందర్భంగా నిధుల కొరత ఉండదని చెప్పారన్నారు. అయితే, ఈ ఏడాది రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధికి కేంద్ర కేటాయింపులతో పాటు అత్యవసర సహాయం ₹219 కోట్లు కోరినట్టు తెలిపారు. మరోసారి ఆర్థిక సాయానికి విజ్ఞప్తి చేస్తామన్నారు.
News October 4, 2024
వైసీపీ కార్యకర్తలు తిరగబడితే కూటమి నేతలు కొట్టుకుపోతారు: పేర్ని నాని
AP: వైసీపీ కార్యకర్తలంతా కలిసి కట్టుగా ఉండాలని మాజీ మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. వైసీపీ కార్యకర్తలు తిరగబడితే కూటమి నేతలు కొట్టుకుపోతారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వారికి సూచించారు. చంద్రబాబులా జగన్‌కు మద్దతు అవసరం లేదని, ఆయన ఒంటరిగా వస్తారని చెప్పారు.