News August 27, 2024
ఆ 5 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకురండి: జగన్
AP: పాడేరు, మార్కాపురం, ఆదోని, పులివెందుల, మదనపల్లె మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలని సీఎం చంద్రబాబును మాజీ సీఎం వైఎస్ జగన్ కోరారు. ఈ కళాశాలలు అందుబాటులోకి వస్తే 750 మంది పేద విద్యార్థులకు సీట్లు లభిస్తాయని ఎక్స్‌లో తెలిపారు. ‘మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దు. ఇలాంటి విధానాలను ఇప్పటికైనా మానుకోండి. కేంద్రం మెడలు వంచి వాటికి అనుమతి తీసుకురావాలి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 21, 2024
భారీ వర్షాలు.. 1,15,151 హెక్టార్లలో పంట నష్టం
AP: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల 1,15,151 హెక్టార్లలో పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు తేల్చారు. ప్రభుత్వం ప్రకటించిన <<14129018>>పరిహారం<<>> ప్రకారం 1,86,576 మంది రైతులకు రూ.278.49కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. 1,12,721 కోళ్లు, 564 పాలిచ్చే పశువులు, 719 మేకలు, గొర్రెలు, 207 ఇతర పశువులు మృత్యువాతపడినట్లు గుర్తించారు. వీటికి పరిహారంగా రూ.3.14కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేశారు.
News September 21, 2024
జానీ మాస్టర్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టనున్న బాధితులు?
మహిళా డాన్సర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్టయిన నేపథ్యంలో ఆయన బాధితులు మరింత మంది బయటికి రానున్నట్లు సమాచారం. జానీ చేసిన పనుల గురించి మరో ఇద్దరు డాన్సర్లు షాకింగ్ విషయాలు వెల్లడించనున్నారని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఆయన చాలా మంది మహిళా అసిస్టెంట్లను ఇలాగే ఇబ్బంది పెట్టేవాడని తెలుస్తోంది. కాగా నిందితుడు జానీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
News September 21, 2024
ఇంటర్ విద్యార్థులకు GOOD NEWS
AP: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌లో CBSE సిలబస్ అమలు చేయడానికి ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. దీనివల్ల మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో సిలబస్ తగ్గనుంది. అలాగే గణితంలో ప్రస్తుతం ఉన్న 2 పేపర్లను ఒకటిగా చేయాలా? అలాగే కొనసాగించాలా అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు JEE మెయిన్స్, అడ్వాన్స్, నీట్ కోచింగ్ ఇప్పించాలని విద్యాశాఖ యోచిస్తోంది.