News October 30, 2024
భారత్లో బ్రిటన్ రాజ దంపతుల సీక్రెట్ ట్రిప్.. ఎందుకంటే!
కింగ్ ఛార్లెస్ III, కామిల్లా దంపతులు భారత్లో రహస్యంగా పర్యటిస్తున్నారని తెలిసింది. OCT 27 నుంచి వీరు బెంగళూరులోని SICHలో వెల్నెస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని సమాచారం. యోగా, థెరపీ, మెడిటేషన్ థెరపీ తీసుకుంటున్నారని IE తెలిపింది. గతంలోనూ వీరిక్కడికి రావడం గమనార్హం. ఓ సీక్రెట్ ట్రిప్ కోసం వీరిద్దరూ OCT 21-26 మధ్య సమోవాకు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా బెంగళూరు HAL ఎయిర్పోర్టులో దిగారని తెలిసింది.
Similar News
News January 3, 2025
జనవరి 3: చరిత్రలో ఈరోజు
1831: సంఘ సంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జననం
1903: సంస్కృతాంధ్ర పండితుడు నిడుదవోలు వేంకటరావు జననం
1925: నటుడు రాజనాల కాళేశ్వరరావు జననం
1934: రచయిత వీటూరి సత్య సూర్యనారాయణ మూర్తి జననం
1940: తెలుగు సినీ దర్శకుడు కట్టా సుబ్బారావు జననం
2002: ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ మరణం
* జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం
News January 3, 2025
ఈ రోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 3, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
✒సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.18 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.54 గంటలకు
✒ ఇష: రాత్రి 7.12 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 3, 2025
శుభ ముహూర్తం (03-01-2025)
✒ తిథి: శుక్ల చవితి రా.12:57 వరకు
✒ నక్షత్రం: ధనిష్ట రా.12.06 వరకు
✒ శుభ సమయం: లేవు
✒ రాహుకాలం: రా.10.30- 12.00
✒ యమగండం: మ.3.00- 4.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12 తిరిగి మ.12.24-1.12
✒ వర్జ్యం: ఉ.6.19 వరకు
✒ అమృత ఘడియలు: మ.1.43-3.15