News September 23, 2024
అన్నయ్య.. అభినందనలు: పవన్ కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ రికార్డు సాధించడం సంతోషంగా ఉందని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అన్నారు. ‘అన్నయ్యకు సినీ ప్రపంచంలో రికార్డులు, విజయాలు కొత్త కాదు. ఈరోజు ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకం. 156 చిత్రాలు, 537 పాటలు, 24వేల స్టెప్స్‌తో అలరించిన నటుడిగా నిలవడం ఎంతో సంతోషం కలిగించింది. ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 6, 2026
తత్కాల్ టికెట్ బుకింగ్ టిప్.. ఈ ఫీచర్‌తో పని ఈజీ!

IRCTCలో తత్కాల్ టికెట్ త్వరగా బుక్ అవ్వాలంటే Master List ఫీచర్ వాడొచ్చు. ‘My Profile’లో ప్రయాణికుల పేర్లు, వయసు, ఆధార్ వివరాలను ముందే సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల బుకింగ్ టైమ్‌లో మళ్లీ టైప్ చేసే పని ఉండదు. కేవలం ఒక్క క్లిక్‌తో ప్యాసింజర్ డీటెయిల్స్ యాడ్ అవుతాయి. టైమ్ ఆదా అవ్వడమే కాకుండా తత్కాల్ సీటు దొరికే ఛాన్స్ పెరుగుతుంది. గరిష్ఠంగా 12 మంది వివరాలను ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.
News January 6, 2026
బంగారు పేపర్లతో భగవద్గీత

కర్ణాటకలోని ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అపురూపమైన కానుక అందింది. ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు రూ.2 కోట్ల విలువైన బంగారు పేపర్లతో రూపొందించిన స్వర్ణ భగవద్గీతను సమర్పించారు. 18 అధ్యాయాలు, 700 శ్లోకాలతో రూపొందిన ఈ గ్రంథాన్ని విశ్వగీతా పర్యాయ ముగింపు రోజున మఠాధిపతి విద్యాధీశతీర్థ స్వామికి అందజేయనున్నారు. ఈ నెల 8న బంగారు రథంలో ఊరేగింపుగా తీసుకొచ్చి మఠానికి బహూకరించనున్నారు.
News January 6, 2026
AIలో 83% విద్యార్థులకు ఉద్యోగాలు

TG: IIT హైదరాబాద్‌లో 62.42% మందికి ఉద్యోగాలు వచ్చినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ BS మూర్తి తెలిపారు. ఈ సారి మొత్తం 487 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 304 మందికి ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. సగటు వార్షిక ప్యాకేజీ రూ.30 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా AI విభాగంలో 83.3% విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ రావడం విశేషం. CSE విద్యార్థి ఎడ్వర్డ్ <<18734504>>వర్గీస్<<>>కు రూ.2.5 కోట్ల ప్యాకేజీతో జాబ్ వచ్చింది.


