News September 23, 2024

అన్నయ్య.. అభినందనలు: పవన్ కళ్యాణ్

image

మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ రికార్డు సాధించడం సంతోషంగా ఉందని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అన్నారు. ‘అన్నయ్యకు సినీ ప్రపంచంలో రికార్డులు, విజయాలు కొత్త కాదు. ఈరోజు ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకం. 156 చిత్రాలు, 537 పాటలు, 24వేల స్టెప్స్‌తో అలరించిన నటుడిగా నిలవడం ఎంతో సంతోషం కలిగించింది. ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 12, 2024

అత్యాచార ఘటన.. సీఎం కీలక ఆదేశాలు

image

AP: శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడలిపై జరిగిన అత్యాచార <<14338493>>ఘటనపై <<>>సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. అటు నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

News October 12, 2024

ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

ITBPలో 545 కానిస్టేబుల్(డ్రైవర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు నవంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10% ఖాళీలను ఎక్స్-సర్వీస్‌మెన్‌కు కేటాయించారు. టెన్త్ పాసైన 21 నుంచి 27 ఏళ్లు వారు దరఖాస్తుకు అర్హులు. హెవీ వాహనాలు నడిపే లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎంపికైన వారికి ₹21,700-69,100 పేస్కేల్ ప్రకారం జీతం చెల్లిస్తారు. ఫీజు ₹100. మరిన్ని వివరాలకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News October 12, 2024

లుంగీలు, దుప్పట్ల సాయంతో జైలు నుంచి జంప్!

image

అస్సాంలోని మోరిగావ్ జిల్లా జైలు నుంచి శుక్రవారం రాత్రి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. లుంగీలు, దుప్పట్లను తాడులా చేసి 20 అడుగుల జైలు గోడను దూకేశారు. ఖైదీలు సైఫుద్దీన్, జియారుల్ ఇస్లాం, నూర్ ఇస్లాం, మఫీదుల్, అబ్దుల్ రషీద్ పోక్సో కేసుల్లో నేరస్థులని, వారి కోసం జిల్లావ్యాప్తంగా జల్లెడ పడుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఖైదీలకు ఎవరైనా సాయం చేశారా అనే కోణంలోనూ విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.