News April 19, 2024

మరదలిపై బావ పోటీ!

image

AP: గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది. ఇక్కడ YCP నుంచి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఆమెపై నారాయణ చెల్లెలి కుమారుడు రమేశ్ కాంగ్రెస్ నుంచి పోటీకి దిగారు. 2019లో నారాయణ విజయం కోసం పని చేసిన రమేశ్.. టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. YCP శ్రేణుల్లో ఆయనకు పరిచయాలు బాగానే ఉండటం కాస్త ప్రభావం చూపొచ్చనే చర్చ స్థానికంగా నడుస్తోంది.

Similar News

News September 11, 2024

వరదలకు ఖమ్మంలో రూ.783 కోట్ల నష్టం: మంత్రి తుమ్మల

image

TG: ఖమ్మం జిల్లాలో ఇటీవల సంభవించిన వరదలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ వరదలకు రూ.783 కోట్ల నష్టం జరిగినట్లు తెలిపారు. 15,196 ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. ఖమ్మంలో ఆరుగురు మృతిచెందారని తెలిపారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేసినట్లు వెల్లడించారు. ఒక్కో కుటుంబానికి రూ.16,500 వరద సాయం ప్రకటించినట్లు పేర్కొన్నారు.

News September 11, 2024

బిడ్డ ఫొటో షేర్ చేసిన ప్రణీత

image

నటి ప్రణీత ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బేబీ ఫొటోను ఆమె తాజాగా ట్విటర్‌లో షేర్ చేశారు. ‘మా బేబీ వచ్చింది. లెట్ ది అడ్వెంచర్ బిగిన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఫొటోలో ఆమె భర్త నితిన్ రాజు కూడా ఉన్నారు. కొవిడ్ సమయంలో పెళ్లి చేసుకున్న ఈ జంట, 2022లో తమ తొలి సంతానం ఆర్ణకు జన్మనించారు. బావ, అత్తారింటికి దారేది తదితర తెలుగు సినిమాల్లో ప్రణీత నటించారు.

News September 10, 2024

తోడేళ్ల దాడులకు ఆ వైరసే కారణం?

image

UP బహ్రైచ్‌ జిల్లాలో తోడేళ్ల దాడులు 50 గ్రామాల ప్రజలను వణికిస్తున్నాయి. వాటికి రేబిస్ లేదా కెనైన్ డిస్టెంపర్ వైరస్ సోకడమే ఇలాంటి అసాధారణ పరిస్థితికి కారణమై ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అవి మనుషులపై భయాన్ని కోల్పోతాయని, విచ్చలవిడిగా కరుస్తాయని పేర్కొంటున్నారు. జంతు నమూనాల సమగ్ర విశ్లేషణ ద్వారానే కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవచ్చని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ చీఫ్ SP యాదవ్ తెలిపారు.