News March 5, 2025

తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే..!

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నానుడిని పక్కా ఫాలో అవుతున్నారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ట్రంప్ స్నేహంగా మెలిగారు. మోదీ స్ట్రాంగ్ అని, అద్భుతంగా చర్చలు జరుపుతారని ప్రశంసలు కురిపించారు. అయితే దేశం వరకు వచ్చేసరికి ట్రంప్ మావ అస్సలు తగ్గట్లేదు. ఇండియా తమ దేశంపై 100%కు పైగా ఆటో టారిఫ్‌లు విధిస్తోందని, ఏప్రిల్ 2 నుంచి తామూ అంతే <<15656615>>వసూలు<<>> చేస్తామని బాంబు పేల్చారు.

Similar News

News March 4, 2026

ఆయిల్ టెన్షన్ అక్కర్లేదు.. 8 వారాల నిల్వలు

image

ఇరాన్ ఉద్రిక్తతలు నెలల తరబడి కొనసాగొచ్చని విశ్లేషణలు వస్తున్నా భారత్‌లో చమురు సంక్షోభం తలెత్తే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మన వద్ద 8వారాలకు సరిపడా నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. హార్ముజ్ జలసంధి నుంచి వచ్చే చమురు 40% మాత్రమే కాగా.. ప్రత్యామ్నాయంగా క్రూడాయిల్ అందించేందుకు రష్యా ముందుకొచ్చింది. అటు హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు రక్షణ కల్పిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.

News March 4, 2026

7,948 MTS, హవల్దార్ పోస్టులు.. పరీక్ష ప్రైమరీ కీ విడుదల

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7,948 MTS, హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు నిర్వహించిన (CBIC & CBN) పరీక్ష ప్రైమరీ కీ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్‌షీట్‌ను చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఉంటే రూ.50 చెల్లించి, మార్చి 6 వరకు తెలుపవచ్చు. వెబ్‌సైట్: https://ssc.gov.in

News March 4, 2026

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ అరియర్లపై గుడ్‌న్యూస్

image

AP: డీఏ అరియర్స్ బిల్లులను సమర్పించడంలో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు నెల రోజుల్లో ఆదేశాలిస్తామని ప్రభుత్వం చెప్పినట్లు AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. పెన్షనర్లు, CPS ఉద్యోగులకు ప్రభుత్వం 2018 జులై నుంచి DA అరియర్లు చెల్లించగా, పలు కారణాలతో చాలా మందికి అవి అందలేదు. దీంతో CFMSలో అరియర్స్ బిల్లులను తిరిగి సమర్పించే వెసులుబాటు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.