News December 20, 2024

అసెంబ్లీలో కొనసాగుతున్న బీఆర్ఎస్ ఆందోళన

image

తెలంగాణ అసెంబ్లీ ఆందోళనల మధ్యే కొనసాగుతోంది. ‘భూభారతి’పై ఒకవైపు మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగా ఫార్ములా-ఈ కార్ రేసు కేసుపై చర్చకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

Similar News

News January 22, 2025

కర్ణాటక ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి

image

కర్ణాటకలో జరిగిన <<15220489>>రోడ్డు ప్రమాదంలో <<>>ఏపీ వాసులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందడం తనను ఆవేదనకు గురిచేసిందని Xలో పోస్ట్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.

News January 22, 2025

హైదరాబాద్‌లో HCL కొత్త టెక్ సెంటర్

image

HYDలో పెట్టుబడి పెట్టేందుకు మరో ప్రతిష్ఠాత్మక కంపెనీ ముందుకొచ్చింది. హైటెక్ సిటీలో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేస్తామని HCL ప్రకటించింది. దావోస్‌లో జరుగుతున్న WEFలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కొత్త టెక్ సెంటర్ ఏర్పాటుతో 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్‌తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి.

News January 22, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.860 పెరిగి రూ.82,090 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.750 పెరిగి రూ.75,250కి చేరింది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. కేజీ వెండి ధర రూ.1,04,000గా ఉంది.