News September 4, 2024
నెల జీతం విరాళంగా ప్రకటించిన BRS

TG: వరద బాధితులకు BRS పార్టీ MLA, MP, MLCలు తమ నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతోనే ఈ ప్రకటన చేస్తున్నట్లు సిద్దిపేట వేదికగా MLA హరీశ్రావు వెల్లడించారు. దీంతో పాటు ఖమ్మం వరద బాధితులకు నిత్యావసర సరకులు పంపించేందుకు ఏర్పాట్లు ఆయన చేస్తున్నారు.
Similar News
News December 4, 2025
భారత్ చేరుకున్న రష్యా డిఫెన్స్ మినిస్టర్.. కాసేపట్లో పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్ కాసేపట్లో భారత్కు రానున్న నేపథ్యంలో ఆ దేశ రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్ ఢిల్లీకి చేరుకున్నారు. పుతిన్తో కలిసి ఆయన భారత్-రష్యా 23వ సమ్మిట్లో పాల్గొంటారు. భారత డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్తో ఆండ్రీ భేటీ అవుతారు. రక్షణ వ్యవస్థకు సంబంధించి ఇరుదేశాల పరస్పర సహకారంపై చర్చించనున్నారు. అటు పుతిన్ భారత్కు చేరుకున్నాక ప్రెసిడెంట్ ముర్ము ఆయనకు ఆతిథ్యం ఇవ్వనున్నారు.
News December 4, 2025
పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు

TG: పంచాయతీ ఎన్నికలకు SEC భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేలా పలు జిల్లాల్లో పోలీసు బలగాలు గ్రామాల్లో కవాతు నిర్వహిస్తున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించి చర్యలు చేపడుతున్నారు. షాద్నగర్ పరిధిలోని పలు పంచాయతీల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.
News December 4, 2025
మామిడిలో జింకు లోపం – లక్షణాలు

సాధారణంగా చౌడు నేలల్లోని మామిడి తోటల్లో జింకు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల క్షీణించి పాలిపోయి చనిపోతాయి. పెరుగుదల దశలో జింకు లోపముంటే ఆకులు చిన్నవిగా మారి సన్నబడి పైకి లేదా కిందకు ముడుచుకుపోతాయి. కణుపుల మధ్య దూరం తగ్గిపోయి, ఆకులు గులాబీ రేకుల వలే గుబురుగా తయారవుతాయి. మొక్కల పెరుగుదల క్షీణించి కాయల పెరుగుదల, నాణ్యత మరియు దిగుబడి తగ్గిపోతుంది.


