News November 15, 2024

BRS, BJP ఒక్కటే అన్నవాడిని చెప్పుతో కొట్టాలి: KTR

image

TG: BRS, BJP ఒక్కటే అన్నవాడిని చెప్పుతో కొట్టాలని KTR ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఆ ప్రచారంలో నిజం ఉంటే MLC కవిత ఎందుకు 5నెలలు జైలులో ఉంటారని ప్రశ్నించారు. BRS, BJP ఒక్కటయితే కలిసి ఉంటే ‘అమృత్ స్కామ్‌’పై తాము ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. మంత్రి పొంగులేటి మీద ED రైడ్స్ జరిగితే వివరాలు ఎందుకు బయటికి రావడం లేదని అన్నారు.

Similar News

News December 7, 2024

ఆ కారు పేరు మార్చేసిన మహీంద్రా

image

మ‌హీంద్రా త‌న కొత్త ఎల‌క్ట్రిక్‌ కారు మోడ‌ల్ పేరును మార్చాల‌ని నిర్ణ‌యించింది. ఇటీవ‌ల SUV మోడ‌ల్స్‌లో BE 6e విడుద‌ల చేసింది. అయితే మోడ‌ల్ పేరులో 6e వాడ‌కంపై విమాన‌యాన సంస్థ‌ IndiGo అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ కోర్టుకెక్కింది. ఏళ్లుగా త‌మ బ్రాండ్ ఐడెంటిటీలో 6eని వాడుతున్నామ‌ని, దీనిపై త‌మ‌కు ట్రేడ్‌మార్క్ హ‌క్కులు ఉన్నాయంటూ వాదించింది. దీంతో మ‌హీంద్రా త‌న BE 6e మోడ‌ల్‌ను BE 6గా మార్చింది.

News December 7, 2024

ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ వల్లే ఎక్కువ నష్టం: సీఎం రేవంత్

image

TG: ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పదేళ్ల పాలనలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం కలిగిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నల్గొండలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం.. బహిరంగ సభలో మాట్లాడారు. లక్ష ఎకరాలకు నీరందించే బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టును అప్పటి సీఎం వైఎస్సార్ ప్రారంభిస్తే.. కేసీఆర్ పదేళ్లు పట్టించుకోలేదని మండిపడ్డారు. SLBC ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఫ్లోరైడ్ సమస్య తీరేదని వ్యాఖ్యానించారు.

News December 7, 2024

వీకెండ్స్ మాత్రమే తాగినా ప్రమాదమే!

image

వారంలో ఒక‌ రోజు మద్యం సేవించినా అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లివర్ డాక్టర్‌గా పేరొందిన సిరియాక్ ఫిలిప్ వారంలో ఒక రోజు మ‌ద్యం సేవించే 32 ఏళ్ల యువ‌కుడి లివ‌ర్ దెబ్బతిన్న తీరును ప్ర‌త్యేక్షంగా చూపించారు. ఆ యువ‌కుడి భార్య ఇచ్చిన ఆరోగ్య‌వంత‌మైన లివ‌ర్‌తో దాన్ని పోలుస్తూ పంచుకున్న ఫొటో వైర‌ల్ అవుతోంది. ఏ మోతాదులో తీసుకున్నా మద్యపానం హానికరమని చెబుతున్నారు. Share It.