News November 9, 2024
సీఎం రేవంత్, కోమటిరెడ్డిపై BRS ఫిర్యాదు
TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ కుక్క చావు చస్తారని సీఎం రేవంత్, KCRను ముక్కలు చేసి మూసీలో వేస్తామని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. వారిని మంత్రి పదవుల నుంచి తొలగించి, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందజేశారు.
Similar News
News December 9, 2024
తల్లి మందలించిందని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
TG: రైలు కిందపడి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. స్థానిక ఓ పాఠశాలలో టెన్త్ చదువుతున్న లక్ష్మీనక్షత్ర(13)ను ఆమె తల్లి ఏదో విషయంలో మందలించింది. దీంతో క్షణికావేశానికి లోనైన ఆమె రైలు కింద పడి సూసైడ్ చేసుకుంది. రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం లక్ష్మీనక్షత్ర మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
News December 9, 2024
గ్రూప్-2 వాయిదాకు ఆదేశించలేం: హైకోర్టు
TG: గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలన్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. పరీక్షకు వారం రోజుల ముందు తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. గ్రూప్-2, RRB పరీక్షలు ఒకే రోజు ఉన్నాయని, పరీక్షలు వాయిదా వేయాలని పలువురు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదల కావడం గమనార్హం.
News December 9, 2024
ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రేపు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ట్వీట్ చేసింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు,నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం రైతులకు సూచించింది.