News May 4, 2024

ప్రజలకు, నాకు మధ్య బీఆర్‌ఎస్ గ్యాప్ సృష్టించింది: తమిళిసై

image

TG: రాష్ట్ర ప్రజలకు, తనకు మధ్య బీఆర్ఎస్ గ్యాప్ సృష్టించిందని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ‘రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పెట్టడానికి ప్రయత్నించాను. కానీ అప్పటి BRS ప్రభుత్వం అందుకు సహకరించలేదు. కేంద్ర పథకాలను ప్రజలకు అందించాలనేదే నా లక్ష్యం’ అని సంగారెడ్డిలో విశిష్ట సంపర్క అభియాన్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ప్రధాని అభ్యర్థి ఎవరో వాళ్లకే తెలియదంటూ ఎద్దేవా చేశారు.

Similar News

News January 27, 2026

పద్మశ్రీ గ్రహీతపై కాంగ్రెస్ విమర్శలు.. శ్రీధర్ వెంబు కౌంటర్

image

పద్మశ్రీకి ఎంపికైన IIT మద్రాస్ డైరెక్టర్ ప్రొ.కామకోటిపై కేరళ కాంగ్రెస్ విమర్శలకు జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు కౌంటర్ ఇచ్చారు. ‘మైక్రో ప్రాసెసర్ డిజైన్‌పై కామకోటి పని చేస్తున్నారు. ఆయన అవార్డుకు అర్హులు. ఆవు పేడ, మూత్రంలో విలువైన మైక్రోబయోమ్‌లు ఉన్నాయి. ఇవి రీసెర్చ్‌కు పనికిరావనే బానిస మనస్తత్వం మనది’ అని విమర్శించారు. గోమూత్రాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లారని కామకోటిని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.

News January 27, 2026

ప్రాధాన్యత వారీగా ప్రాజెక్టుల పూర్తి: CBN

image

AP: వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాదే పూర్తి చేయాలని CM చంద్రబాబు ఆదేశించారు. ‘గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. గాలేరు-నగరి ప్రాజెక్టు ద్వారా కృష్ణా నీటిని కడపకు తీసుకెళ్లేలా చూడాలి. 10 జిల్లాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యతల వారీగా పూర్తిచేయాలి’ అని సూచించారు. DP వరల్డ్ సంస్థ(దుబాయ్) ఉద్యాన క్లస్టర్ ఏర్పాటు చేయనుందని తెలిపారు.

News January 27, 2026

EUతో డీల్.. తెలుగు స్టేట్స్‌కు లాభమేంటంటే?

image

భారత్-EU మధ్య ఫ్రీ <<18973548>>ట్రేడ్ డీల్<<>> జరిగిన విషయం తెలిసిందే. దీంతో యూరప్‌లోని 27 మార్కెట్లు మన ఆంత్రపెన్యూర్స్‌కు అందుబాటులోకి వచ్చాయి. ఓవరాల్‌గా 15 రంగాలకు సంబంధించిన ఎగుమతుల్లో రూ.6.4లక్షల కోట్ల వరకు అదనపు అవకాశాలు దక్కుతాయి. AP నుంచి సీ ఫుడ్, కెమికల్స్, ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్.. TG నుంచి టెక్స్‌టైల్స్, ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ గూడ్స్ రంగాల ఉత్పత్తులకు లబ్ధి చేకూరనుంది.