News May 4, 2024

ప్రజలకు, నాకు మధ్య బీఆర్‌ఎస్ గ్యాప్ సృష్టించింది: తమిళిసై

image

TG: రాష్ట్ర ప్రజలకు, తనకు మధ్య బీఆర్ఎస్ గ్యాప్ సృష్టించిందని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ‘రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పెట్టడానికి ప్రయత్నించాను. కానీ అప్పటి BRS ప్రభుత్వం అందుకు సహకరించలేదు. కేంద్ర పథకాలను ప్రజలకు అందించాలనేదే నా లక్ష్యం’ అని సంగారెడ్డిలో విశిష్ట సంపర్క అభియాన్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ప్రధాని అభ్యర్థి ఎవరో వాళ్లకే తెలియదంటూ ఎద్దేవా చేశారు.

Similar News

News December 7, 2025

సంకటహర చతుర్థి ప్రత్యేకత ఏంటంటే?

image

ఇవాళ వినాయకుడిని పూజిస్తే జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ‘ఇవాళ సాయంత్రం 6.25 గంటలకు చతుర్థి ప్రారంభమయ్యి సోమవారం సాయంత్రం 4.03 గంటలకు ముగుస్తుంది. ఈరోజు వినాయకుడిని గరికతో పూజించడం విశేషం. చంద్ర దర్శనం తర్వాత వినాయక పూజ చేసుకోవడం శుభప్రదం. సంకటహర చతుర్థి వ్రతాన్ని చతుర్థి తిథిరోజు 3, 5, 11, 21 నెలలపాటు ఆచరించాలి. దీనిని బహుళ చవితి రోజు ప్రారంభించాలి’ అని పండితులు చెబుతున్నారు.

News December 7, 2025

ఈ ఆలయాలకు వెళ్తే..

image

మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్ శని దోష నివారణకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఊర్లో ఇళ్లు, షాపులకు తలుపులు ఉండవు. న్యాయాధిపతి శని దేవుడి మహిమ వల్ల ఇక్కడ దొంగతనాలు జరగవని నమ్ముతారు. శని దోషం ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శిస్తే శని దోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు. శని ధామ్(ఢిల్లీ), కోకిలవ ధామ్(UP), తిరునల్లార్(తమిళనాడు) ఆలయాలను దర్శించడం వల్ల కూడా శని గ్రహ ప్రభావం తగ్గుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News December 7, 2025

కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్: స్టెయిన్

image

టీమ్ ఇండియాపై వన్డే సిరీస్ కోల్పోవడం కాస్త నిరుత్సాహ పరిచిందని SA మాజీ పేసర్ డేల్ స్టెయిన్ పేర్కొన్నారు. ‘ఇది ఒక బ్యాడ్ డే. సిరీస్ డిసైడర్‌లో తప్పులకు తావుండకూడదు. టీమ్ ఇండియాకి శుభాకాంక్షలు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ(65*) అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్. నేను 20-20 మ్యాచుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. IND-SA మధ్య 5 టీ20ల సిరీస్ డిసెంబర్ 9 నుంచి కటక్ వేదికగా ప్రారంభంకానుంది.