News December 20, 2024
బీఆర్ఎస్ అహంభావంతో వ్యవహరిస్తోంది: CM

TG: అసెంబ్లీలో బీఆర్ఎస్ అహంభావంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. భూభారతిపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన అమర్యాదతో సభాపతిపైనే పేపర్లు చింపి విసిరేశారని చెప్పారు. వారిపై చర్యలు తీసుకొనే పరిస్థితులు వచ్చినా స్పీకర్ ఓపికతో వ్యవహరించారని తెలిపారు. ప్రతిపక్షం సహనం కోల్పోయిందని సీఎం వ్యాఖ్యానించారు.
Similar News
News November 14, 2025
నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*ఏపీలో రూ.82వేల కోట్లతో రెన్యూ ఎనర్జీ కంపెనీ పెట్టుబడులు
*2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలు: CM CBN
*మంత్రి కొండా సురేఖ క్షమాపణలు.. కేసు విత్డ్రా చేసుకున్న నాగార్జున
*తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దరఖాస్తులు
*అల్ ఫలాహ్ వర్సిటీ సభ్యత్వం రద్దు చేసిన AIU
*బంగ్లాలో మళ్లీ హింస.. బాంబు దాడులు
*IPL: ముంబైలోకి శార్దుల్ ఠాకూర్, రూథర్ఫర్డ్
News November 14, 2025
భారత విద్యార్థులకు రష్యా స్కాలర్షిప్స్

తమ దేశంలో చదువుకునే భారత విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తామని రష్యా ప్రకటించింది. 2026-27లో 300 మందికి అందజేస్తామని తెలిపింది. రష్యాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో మెడిసిన్, ఫార్మసీ, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ఏవియేషన్, మేనేజ్మెంట్ తదితర డిగ్రీ, PG కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ స్కాలర్షిప్స్లో ట్యూషన్ ఫీజు కవర్ అవుతుందని, విద్యార్థులు ఎలాంటి ఖర్చు లేకుండా చదువుకోవచ్చని చెప్పింది.
News November 14, 2025
‘రహేజా’కు భూ కేటాయింపుతో APకి ఏం లాభం? SMలో ప్రశ్నలు

AP: విశాఖలో రహేజా సంస్థకు 99 పైసలకే 27 ఎకరాల భూ కేటాయింపును నెటిజన్లు తప్పుబడుతున్నారు. భారీగా ఉద్యోగాలు కల్పించే TCS లాంటి కంపెనీలకు ఇవ్వడంలో తప్పు లేదు కానీ, కమర్షియల్ బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ సంస్థకు కారుచౌకగా కట్టబెడతారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆస్తిని కొద్దిమంది బలవంతులకు భోజనంగా వడ్డించినట్లు ప్రభుత్వ నిర్ణయం ఉంది తప్ప, APకి ఏ లాభం కన్పించడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.


