News November 12, 2024
ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా BRS అడ్డుకుంటోంది: మంత్రి శ్రీధర్
TG: ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా బీఆర్ఎస్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. లగచర్లలో అధికారులపై దాడి ఘటనను రాజకీయం చేయాలనుకోవట్లేదని చెప్పారు. భూసేకరణపై ప్రజాభిప్రాయం కోసం కలెక్టర్ గ్రామానికి వెళ్లారని, కొందరు రైతుల్ని రెచ్చగొట్టి దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ కుట్ర వెనుక ఉంది ఎవరో విచారణలో తేలుతుందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News December 6, 2024
PHOTO: గన్నుతో సీఎం రేవంత్
TG: ప్రజాపాలన-విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ హోంశాఖ విజయాలపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన ఆయుధాల ఎగ్జిబిషన్‌ను ఆయన సందర్శించారు. గన్నులు, రైఫిల్స్ పనితీరును ఆసక్తిగా పరిశీలించారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోనే ఇది. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.
News December 6, 2024
ఆర్టీసీ పికప్ వ్యాన్‌ల సేవలు ప్రారంభం
TGSRTC దూర ప్రాంత ప్రయాణికుల కోసం పికప్ వ్యాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి విడతలో ECIL-LB నగర్ మధ్య ఉన్న ప్రాంతాల నుంచి ఈ సేవలను ప్రారంభించింది. విశాఖ, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కాకినాడ, కందుకూరు వెళ్లే వారి కోసం ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. వివరాల కోసం 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ సూచించింది.
News December 6, 2024
పిల్లలకు ఈ పేర్లు పెట్టరు!
మా బిడ్డకు మా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటాం అంటే కొన్ని దేశాల్లో కుదరదు. పలు రకాల పేర్లు చట్ట విరుద్ధం. జర్మనీ, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్‌లో అడాల్ఫ్ హిట్లర్ పేరు పెట్టకూడదు. జపాన్‌లో అకుమా(దెయ్యం), మెక్సికోలో ఆల్ పవర్, సౌదీలో అమీర్, పోర్చుగల్‌లో అశాంతి, మలేషియాలో చౌ టౌ, యూకేలో సైనైడ్, డెన్మార్క్‌లో మంకీ, జర్మనీలో ఒసామా బిన్ లాడెన్, డెన్మార్క్‌లో ప్లూటోవంటి పేర్లపై నిషేధం ఉంది.