News November 25, 2024

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల ఏడుపు: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: అధికారం పోయిందని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక అల్లాడిపోయారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. తమది చేతల ప్రభుత్వమని, ఇచ్చిన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తామని చెప్పారు.

Similar News

News December 3, 2025

దేవుడి వ్యాఖ్యలపై అనవసర వివాదం: CM

image

TGలో అభివృద్ధి పనులకు సహకరించాలని PM మోదీని కోరినట్లు CM రేవంత్ తెలిపారు. ‘మీరు CMగా ఉన్నప్పుడు నాటి PM మన్మోహన్ సింగ్ గుజరాత్ అభివృద్ధికి సహకరించారు. అలాగే మీరు కూడా TG అభివృద్ధికి సహకరించండి’ అని కోరానన్నారు. నిన్న తమ పార్టీలో భిన్న రకాల మనస్తత్వాలను వివరించే ప్రయత్నంలో చేసిన <<18451881>>కామెంట్లను<<>> BJP నేతలు అనవసర వివాదం చేస్తున్నారని మీడియాతో అన్నారు. రెండు టర్మ్‌లు తానే CMగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు.

ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే ఏంటి?

image

తిరుమలలో ఏడాదికి ఓసారి ‘సాలకట్ల బ్రహ్మోత్సవాలు’ నిర్వహిస్తారు. అయితే, ఈ ఉత్సవ వైభవాన్ని భక్తులు రోజూ దర్శించుకునేందుకు వీలుగా TTD ఈ ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని ఏర్పాటు చేసింది. దీనిని వైభవోత్సవ మండపంలో నిర్వహిస్తారు. ఈ సేవలో భాగంగా స్వామివారికి రోజూ శేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహన సేవలను జరుపుతారు. ఇది భక్తులకు నిత్యం స్వామివారి ఉత్సవ శోభను చూసే అవకాశం కల్పిస్తుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>