News November 25, 2024
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల ఏడుపు: మంత్రి శ్రీధర్ బాబు
TG: అధికారం పోయిందని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక అల్లాడిపోయారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. తమది చేతల ప్రభుత్వమని, ఇచ్చిన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తామని చెప్పారు.
Similar News
News December 9, 2024
రోహిత్ ఓపెనర్‌గా వచ్చి ఉంటే?
అడిలైడ్ టెస్టులో టీమ్‌ఇండియా ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ రెండో టెస్టుకు అందుబాటులో ఉన్నా, ఓపెనింగ్ చేయలేదు. ఆ స్థానాన్ని రాహుల్‌కు ఇచ్చారు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ తొలి ఇన్సింగ్స్‌లో 3పరుగులు, రెండో ఇన్సింగ్స్‌లో 6పరుగులు చేసి ఔటయ్యారు. ఎప్పటి లాగే ఓపెనింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీ కామెంట్.
News December 9, 2024
చెక్‌పై అమౌంట్ పక్కన ‘Only’ ఎందుకు రాస్తారు?
ఈ డౌట్ మీకు వచ్చిందా? ఉదాహరణకు చెక్‌పై రూ.1,00,000 ఇలా రాసిన తర్వాత ONE Lakh Rupees Only రాయడం గమనించే ఉంటారు. చెక్ ట్యాంపర్ అవ్వకుండా, మనం రాసిన అమౌంట్ పక్కన నంబర్లు చేర్చకుండా ఉండేందుకు ఓన్లీ అని రాయడం ముఖ్యం. పదాలలో రాసి చివర ఓన్లీ అని రాయడం వల్ల సంఖ్యను మార్చినా, పదాలను ఛేంజ్ చేయలేదు. ఒకవేళ కొట్టేసి రాసినా అలాంటి చెక్కులను బ్యాంకులు అంగీకరించవు. మోసాలను నివారించడానికి Only మస్ట్.
News December 9, 2024
రూపం ఏదైనా తెలంగాణ తల్లి ప్రతిరూపమే: విజయశాంతి
TG: రూపం ఏదైనా బలిదానాలతో సాధించుకున్న ప్రతి తెలంగాణ తల్లి స్వరూపం మనకు ప్రతినిత్యం ప్రాతస్మరణీయం అని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. అమ్మోరు తల్లి లెక్క నూరు రూపాలైనా, ఏ రూపంలో ఉన్నా మన తెలంగాణ తల్లి ప్రతిరూపమే అని చెప్పారు. నిర్బంధాలను దాటుకొని 2007లో తొలిసారి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అయిందన్నారు. ఆ తర్వాత BRS, ఇప్పుడు కాంగ్రెస్ ఆవిష్కరిస్తున్న విగ్రహం తెలంగాణ తల్లి ప్రతిరూపమే అన్నారు.