News February 25, 2025
ఎల్లుండి SLBCకి BRS నేతలు: హరీశ్రావు

TG: SLBC ఘటన చాలా దురదృష్టకరమని, చాలా బాధాకరమని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఎల్లుండి తమ పార్టీ నేతలు SLBC సందర్శనకు వెళ్తారని, పోలీసులు తమను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అటు ఈ ఘటనపై జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి KTR ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఘటనపై విచారణ చేపట్టాలని సూచించారు.
Similar News
News February 25, 2025
ఆ స్కూళ్లలో తెలుగు తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు

TG: సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోధించే స్కూళ్లలో తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సింగిడి(స్టాండర్డ్ తెలుగు) స్థానంలో సులభతర తెలుగు వాచకం ‘వెన్నెల’ను 9, 10వ తరగతుల్లో బోధించాలని స్పష్టం చేసింది. 1-10 క్లాసుల వరకు తెలుగు బోధన, పరీక్షలు నిర్వహించాలని ఆయా బోర్డులను ఆదేశించింది. గత ప్రభుత్వం తెలుగును పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పేర్కొంది.
News February 25, 2025
పట్టాలెక్కనున్న రవితేజ ‘డబుల్ ధమాకా’?

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘ధమాకా’ 2022లో విడుదలై రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘డబుల్ ధమాకా’ తెరకెక్కనున్నట్లు సమాచారం. దర్శకుడు త్రినాథరావు ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేశారని, మాస్ మహారాజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి.
News February 25, 2025
త్రిమూర్తులు ఉన్న క్షేత్రం త్రయంబకేశ్వరం

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహారాష్ట్ర నాసిక్ <<15541576>>త్రయంబకేశ్వరం <<>>10వది. గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చిన శివుడు, ఆదిపరాశక్తితో పాటు బ్రహ్మ, విష్ణు సమేతంగా ప్రత్యక్షమవుతారు. గంగ ప్రవహించేలా చేయమని ముని కోరటంతో తన జటాజూటాన్ని విసరగా అది బ్రహ్మగిరి పర్వతంపై పడి ప్రవాహంగా వచ్చిందనేది స్థలపురాణం. ఆదిపరాశక్తి, త్రిమూర్తులు స్వయంభువుగా వెలియడంతో జ్యోతిర్లింగంగా మారింది. త్రిమూర్తులు ఒకేచోట లింగం రూపంలో ఉంటారు.