News February 25, 2025

ఎల్లుండి SLBCకి BRS నేతలు: హరీశ్‌రావు

image

TG: SLBC ఘటన చాలా దురదృష్టకరమని, చాలా బాధాకరమని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఎల్లుండి తమ పార్టీ నేతలు SLBC సందర్శనకు వెళ్తారని, పోలీసులు తమను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అటు ఈ ఘటనపై జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి KTR ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఘటనపై విచారణ చేపట్టాలని సూచించారు.

Similar News

News March 21, 2025

IOC కొత్త ప్రెసిడెంట్‌గా కిర్స్టీ కోవెంట్రీ

image

ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్‌గా జింబాబ్వే స్విమ్మర్, పొలిటీషియన్ కిర్స్టీ కోవెంట్రీ ఎన్నికయ్యారు. దీంతో IOC తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. గ్రీస్‌లో జరిగిన 144వ IOC సెషన్‌లో కమిటీ మెంబర్స్ ఆమెను ఎన్నుకున్నారు. ఈ సెషన్‌లో పాల్గొన్న ఐసీసీ ఛైర్మన్ జైషా ఆమెకు విషెస్ తెలిపారు. లాస్ ఏంజెలిస్-2028 ఒలింపిక్స్ గేమ్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 21, 2025

పాస్టర్ల గౌరవ వేతనం విడుదల

image

AP: రాష్ట్రంలోని పాస్టర్లకు మూడు నెలల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,427మంది పాస్టర్లకు రూ.12,82,78,000 నిధులు విడుదల చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రభుత్వం గత ఏడాది మే నెల నుంచి పాస్టర్లకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తున్న సంగతి తెలిసిందే.

News March 21, 2025

రానున్న 3 నెలలు జాగ్రత్త: సీఎస్ విజయానంద్

image

AP: రానున్న 3 నెలలు అధిక ఉష్ణోగ్రత, వడగాలుల పట్ల రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) కె.విజయానంద్ సూచించారు. వడగాలుల నుంచి ఉపశమనం పొందేందుకు ముందు జాగ్రత్త చర్యలు ముఖ్యమన్నారు. వడదెబ్బ తాకకుండా నీటిని అధికంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో ఈ మేరకు వీడియో సమావేశం ద్వారా సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

error: Content is protected !!